చంద్రబాబు అడ్డాలో సరికొత్త రచ్చ తలపట్టుకున్న 40 ఇయర్స్ రాజకీయం..!

tdp president chandrababu is still going with outdated tdp leaders

2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. విభజన తరువాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందొ ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ పరిస్థితి అలానే ఉంది. ప్రజల అభిమానాన్ని పొందడంలో టీడీపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ ఉన్న టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడి మాటలు కూడా లెక్కచేయడం లేదు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి, సిటీ నుంచి ఆదిరెడ్డి భ‌వానీలు విజ‌యం సాధించారు.
Nara Chandra Babu Naidu
ఇక‌ రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి మాగంటి రూపాదేవి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ఇక్క‌డ జెండా మోసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఓడిపోయిన రూపాదేవి.. ఏకంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఆమెకు రాజ‌కీయాలు చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. మామ‌.. ముర‌ళీ మోహ‌న్ స‌ల‌హా మేరకు ఆమె సొంత వ్యాపారాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు.

మాజీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్న ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిభవాని కూడా నియోజకవర్గంలో ఆక్టివ్ గా ఉండటం లేదు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కరోనా భయంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. అలాగే ఆయన మీడియా చర్చలకు పరిమితం అవుతున్నారని, అలాగే ఆయన రిటైర్మెంట్ కూడా దగ్గర పడుతుండటంతో రాజకీయాల గురించి అంతగా ఆలోచించడం లేదని తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా ఇక్కడి టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. రాజమండ్రిలో టీడీపీ రానున్న రోజుల్లో నేలమట్టం కానుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ అనుభవం కూడా టీడీపీ పతనాన్ని కాపాడలేకపోతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు.