వైసీపీ ఏమో టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుంటూ చంద్రబాబు నాయుడుకు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడ లేకుండా చేయాలి ట్రై చేస్తున్నారు. ఉన్న 23 మందిలో ఇప్పటికే నలుగురు టీడీపీని వీడగా ఇంకో ఇద్దరు రెడీగా ఉన్నారు. దీంతో టీడీపీ భవితవ్యం సందిగ్ధంలో పడింది. చంద్రబాబు ఏమో ఎవరైనా నేతలు పార్టీని వీడాలనుకుంటున్నట్టు తెలుస్తే వెంటనే వారిలో టచ్లోకి వెళ్ళిపోయి బ్రతిమాలే పనిచేస్తున్నారు. అలా ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఆపుకోగలిగారు. అంతటితో చంద్రబాబు నాయుడు తన పని అయిపోయిందని అనుకోలేదు. జగన్ ఏ ఫార్ములానైతే తన మీద ప్రయోగిస్తున్నారో దాన్నే వైసీపీకి మీదకి ప్రయోగిస్తున్నారు చంద్రబాబు.
ఆయన వైసీపీలోని అసంతృప్త నేతల మీద కన్నువేశారు. కావలి నియోజకవర్గాన్నే తీసుకుంటే అక్కడ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడ వైసీపీలోనే ఉన్నారు. అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి డామినేషన్ ఆయన తట్టుకోలేకపోతున్నారట. పార్టీ వ్యవహారాలన్నింటినీ ప్రతాప్ కుమార్ రెడ్డి చూసుకుంటూ ఒంటేరును వేలు కూడ పెట్టనివ్వట్లేదట. ఏ పనైనా ఆయన చేతుల మీదుగానే జరిగిపోవాల్సిందేనట. అదే వేణుగోపాల్ రెడ్డికి నచ్చక తీవ్ర అసంతృప్తి చెందుతున్నారట. ఇది గమించిన చంద్రబాబు రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారట. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు.
ఇప్పటికీ ఆయనకు టీడీపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే చంద్రబాబు నేతల ద్వారా ఆయనకు కబురు పంపారట. పార్టీలోకి వస్తే ప్రాముఖ్యత ఖాయమని హామీ ఇస్తున్నారట. గతంలో కావలి టీడీపీ పనులను బీద మస్తాన్ రావు చూసుకునేవారు. ఆయన కూడ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇలా ప్రముఖ లీడర్లంతా వైసీపీ జెండా కిందే ఉండటంతో అక్కడ పోటీని తట్టుకోలుకున్నారు వేణుగోపాల్. చంద్రబాబు ఏమో పార్టీలోకి వస్తే కావలి ఇంఛార్జ్ పదవి ఇస్తానని అంటున్నారట. ఈ మూడేళ్ళలో వేణుగోపాల్ గనుక టీడీపీలో ఉండి బలం పుంజుకోగలిగితే వచ్చే దఫాలో టికెట్ కూడ దక్కించుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన ఏ క్షణమైనా టీడీపీ జెండాను పెట్టుకోవచ్చని చెప్పుకుంటున్నారు కావలి రాజకీయ వర్గాలు.