ఆ జిల్లాలపై విషం చిమ్ముతున్న చంద్రబాబు నాయుడు.. ఏం జరిగిందంటే?

2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి తక్కువ సీట్లు రావడంలో రాయలసీమ జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా 49 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తే కేవలం 3 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ రాయలసీమ గురించి చంద్రబాబు గొప్పగా చెప్పిన సందర్భాల కంటే విమర్శలు చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి.

తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలలో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే స్థానిక నాయకులు వడ్డీతో సహా చెల్లించాలని కామెంట్లు చేశారు. రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకు ఇంత చిన్న చూపు ఎందుకని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ రాయలసీమకు చెందిన వ్యక్తి అయినంత మాత్రాన చంద్రబాబు రాయలసీమ గొప్పదనాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయడం ఏ మాత్రం మంచిది కాదు.

14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు సీమలో ఫ్యాక్షన్ లేకపోయినా పదేపదే రాయలసీమ స్థాయిని తగ్గించే విధంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కామెంట్ల ద్వారా చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకోవడంతో పాటు సీమ ప్రజలకు మరింత దూరమవుతున్నారు. ఇలాంటి కామెంట్ల వల్ల చంద్రబాబు 2024 ఎన్నికల్లో కుప్పంలో గెలవకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

ఇతర ప్రాంతాల ప్రజల మెప్పు పొందడానికి చంద్రబాబు రాయలసీమ స్థాయిని తగ్గించాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి తన స్థాయికి తగిన మాటలు మాట్లాడితే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు.