చంద్రబాబు చివరి ప్రయత్నం

చేసిందే తప్పుడు పని. డేటా చోరీలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు చివరి మార్గంగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చివరి ప్రయత్నంగా సిట్ ఏర్పాటు చేశారు. ఫారం 7 దాఖలుపైన కూడా మరో విచారణ కమిటీని వేయాలని అనుకుంటున్నారు. నిజానికి ఫారం 7 అన్నది ఎన్నికల కమీషన్ కు సంబంధించిన వ్యవహారం.  ఫారం 7 దాఖలుపైన కూడా ప్రత్యేక కమిటీ వేయాలన్న ఆలోచన చేయటమంటే ఎన్నికల కమీషన్ విధుల్లోకి కూడా ప్రవేశించటమే.

ఇప్పటికే ఫారం 7 దాఖలు చేయటం నేరమేమీ కాదని ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేది స్పష్టంగా ప్రకటించారు. అయినా చంద్రబాబు మాత్రం పదే పదే ఫారం 7 దాఖలు చేయటం నేరమంటూ జనాల మైండ్ ను హిప్నటైజ్ చేయాలని చూస్తున్నారు. ఎన్నికల కమీషనరే నేరం కాదని చెప్పేసిన తర్వాత చంద్రబాబు ఏమి చెప్పినా చెల్లదనుకోండి అది వేరే సంగతి.

పైగా వైసిపిని గెలిపిస్తే ఏపి తెలంగాణా ప్రభుత్వానికి సామంతరాజ్యంగా మారుతుందనే సెంటిమెంటును రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబును ఉద్దేశించి కెసియార్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో అచ్చంగా అలాగే చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే తెలంగాణాలో కెసియార్ మాటలను జనాలు నమ్మి చంద్రబాబు మాడు పగలగొట్టారు. రేపటి ఎన్నికల్లో ఏపి జనాలు ఏం చేస్తారో చూడాలి.

కంపెనీ నుండి హార్డ్ డిస్కులను, సర్వర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులేమో రాష్ట్రంలోని 3.5 కోట్లమంది జనాల వ్యక్తిగత వివరాలన్నీ ఐటి గ్రిడ్స్ కంపెనీలో దొరికినట్లు తెలంగాణా పోలీసులే నిర్ధారించారు. అయినా చంద్రబాబు ఒప్పుకోవటం లేదు. గ్రిడ్స్ కంపెనీ కేవలం టిడిపి వ్యవహారాలను అడ్ డేట్ చేసేందుకు మాత్రం ఉద్దేశించిందని  చంద్రబాబు ఇంకా బుకాయిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే కంపెనీ ఛైర్మన్ దాకవరపు అశోక్ పారిపోవాల్సిన అవసరం ఏమిటి ? ఈ కేసులో నుండి బయటపడేందుకు చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నట్లే కనబడుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.