కొత్త భయం: కుప్పం నేతలు కూడా బాబునే ఫాలో అయితే…!

గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019 ఎన్నికల ఫలితాల అనంతరం బాబులో కొత్త భయం మొదలైంది. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ భయం పీక్స్ కి చేరిందని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా ఆయన కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అంటున్నారు. ఈ సమయంలో కుప్పం నేతలు చంద్రబాబునే ఫాలోఅయితే జరగబోయేది చారిత్రక అంశమే అనే చర్చ తెరపైకి వస్తుంది.

అవును… రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని.. ఫలితంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా చూడాలని వైసీపీ స్కెచ్చులు వేస్తుంది. ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం! దీంతో చంద్రబాబు కుప్పంపై పూర్తిగా కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ప్రజల్తోనూ, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలతో ప్రమాణాలు చేయించుకుంటున్నారు. మాట తీసుకుంటున్నారు.

టీడీపీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో కుప్పంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గత రెండు మూడు నెలలుగా వీలు కుదిరినప్పుడల్లా.. కుదరకపోయినా వీలుచేసుకుని మరీ రెగ్యులర్ గా కుప్పంలో పర్య్టిస్తున్నారు చంద్రబాబు. దీంతో రెండు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి… చంద్రబాబుకి కుప్పంలో ఓటమి భయం పట్టుకుందని కాగా… నేతలు కూడా బాబును ఫాలో అయితే ఏమిటి పరిస్థితి అని.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… నేతలు కూడా చంద్రబాబుని ఫాలో అవ్వడం అంటే… ఆయన వెనక నడుస్తూ ఆయనను అనుసరించడం కాదు… ఆయనలా మాట తప్పుతూ ఆయనను అనుకరించడం! అవును… స్థానికంగా ఉన్న ప్రతీ ద్వితీయశ్రేని నేతతోనూ చంద్రబాబు ప్రమాణాలు చేయించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని, గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని ప్రాదేయపడుతున్నారు.

రాష్ట్రం సంగతి కాసేపు పక్కనపెడితే… కుప్పంలోనే చంద్రబాబు ఎంతో మందికి ఎన్నో హామీలిచ్చారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ ఎన్నో వాగ్ధానాలు చేశారు. మ్యానిఫెస్టో రూపంలో మరెన్నో ప్రమాణాలు చేశారు. మరి చంద్రబాబు ఆ ప్రంఆణాలన్నీ పాటించారా.. ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా.. జనాలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చారా…? మరి ఈ సమయంలో చంద్రబాబు ముందు ప్రమాణాలు చేస్తున్న నేతలు, ప్రజలు సైతం ప్రమాణాలు నెరవేర్చకుండా తప్పించుకునే విషయంలో బాబునే ఫాలో అయితే…? అది ఏపీ ఎన్నికల చరిత్రలో ఒక చారిత్రక అధ్యాయంగా మిగిలిపోయే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉంది!