ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులను, టీడిపీ అభిమానులను ఎంతగానో బాధపెట్టిన సంగతి తెలిసిందే. కొంతమంది వైసీపీ నేతలు సైతం ఇందుకు సంబంధించి జగన్ ను తప్పుబట్టారు. అయితే గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు విషయంలో విమర్శలు చేసిన చంద్రబాబు అన్ స్టాపబుల్ షోలో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి ఘాటుగా స్పందించారు.
షోలో బావ అని పిలుస్తానని బాలయ్య చెప్పగా చంద్రబాబు కూడా సరేనన్నారు. మొదటిది నా ఫ్యామిలీ అని రెండోది అన్ స్టాపబుల్ ఫ్యామిలీ బాలయ్య తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ విజన్ అంటే నన్ను అందరూ ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు. చాలా పార్కులు, స్టేడియంలు కట్టారు కదా బావా? వాళ్ల పేర్లు ఎందుకు పెట్టారని బాలయ్య అడగగా చంద్రబాబు స్పందిస్తూ ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ల పేర్లు పెడతామని తెలిపారు.
ఆ తర్వాత మా నాన్న కంట్రిబ్యూట్ చెయ్యలేదని చెప్పి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని బాలయ్య కామెంట్లు చేశారు. బాలయ్య కామెంట్ల గురించి చంద్రబాబు మాట్లాడుతూ పేరు మార్చడం దురదృష్టకరమని అన్నారు. ఇది రెండుసార్లు జరిగిందని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విషయంలో వైఎస్సార్ పేరు మార్చారని చంద్రబాబు అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు.
ఏడాదిన్నర తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నేను వైఎస్సార్ పేర్లను మార్చలేదని చంద్రబాబు తెలిపారు. మరి టీడీపీ అధికారంలోకి వచ్చి మళ్లీ హెల్త్ యూనివర్సిటీ పేరు పేరు మారుస్తుందేమో చూడాల్సి ఉంది. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం హెల్త్ యూనివర్సిటీ పేరు మారుతుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు కామెంట్లపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జగన్ కు చంద్రబాబు షాకిచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.