చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల… బీపీ, పల్స్ ఇలా ఉన్నాయి!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 44 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్నారు. చంద్రబాబుకు ఆహారం, మెడిసిన్స్ ఇంటినుంచి అందుతున్నాయి. ఈ సమయంలో గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు అస్వస్థతగా ఉంది! ఇందులో భాగంగా ఆయనను స్కిన్ అలర్జీ ఇబ్బందిపెడుతుందని అధికారులు తెలిపారు. క్రీములు వాడుతున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కాస్త చల్లని ప్రదేశంలో ఉండాలని.. వేడి ఉష్ణోగ్రతల వల్ల స్కిన్ అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. దీంతో కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సమయంలో ప్రతీ రోజూ రాత్రి ఆ రోజుకు సంబంధించి చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను అధికారులు విడుదల చేస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం రాత్రి కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబందించిన వివరాలను అధికార్లు వెల్లడించారు. సోమవారం నిద్రపోయే సమయానికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగా… బ్లడ్ ప్రెజర్, హార్ట్ బీట్, రెస్పిరేటరీ రేట్, లంగ్స్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీ, టెంపరేచర్ ఏ విధంగా ఉన్నాయనే మొదలైన వివరాలు వెల్లడించారు.

ఈ మేరకు.. ఈరోజు 23-10-2023 నాడు జైలు వైద్య అధికారులు, రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి వైద్య (జీజీహెచ్) అధికారుల బృందం.. రిమాండ్ ముద్దాయి నం:7691, నారా చంద్రబాబు నాయుడు, తండ్రి – ఖర్జూరనాయుడుకి కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం నందు పరీక్షించి ఈ కార్యలయానికి నివేదిక ఈ విధంగా అధికారులు సమర్పించారు అని పేర్కొంటూ వివరాలు విడుదల చేశారు.

హెల్త్ బులిటెన్ లో వెల్లడించిన వివరాలు:

బ్లడ్ ప్రెజర్ (బీపీ) – 120 / 70

పల్స్ – 62 / మినిట్

రెస్పిరేటరీ రేట్ – 12 / మినిట్

గుండే – ఎస్ 1+, ఎస్ 2+

ఎస్పీఓ2 – 97% ఆన్ రూం ఎయిర్

లంగ్స్ – క్లియర్

టెంపరేచర్ – సాధారణం

ఫిజికల్ యాక్టివిటీ – గుడ్