ఉన్నట్టుండి… రాత్రికి రాత్రి చంద్రబాబుకు రూ. 600 కోట్ల లాభం.!

Nara Chandra Babu Naidu

కరోనా వల్ల చాలామంది జీవితాలు నాశనమయ్యాయి. దాదాపు అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వల్ల కొంతమంది చనిపోతే మరికొంతమంది కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించారు. అయితే ఈ కరోనా సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కొనసాగిన వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఆన్లైన్ బిజినెస్. ఈ కరోనా సమయంలోనే కరోనా టైంలో అంతా ఆన్ లైన్లో కొనడంతో ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఆదాయం 2.85 శాతం పెరిగింది. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు సిఇఒ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే మొదటి 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా అవతరించారు.

ప్రస్తుతం బెజోస్ మొత్తం నికర విలువ 4204.6 బిలియన్లు. అలాగే ఈ కరోనా వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా లాభపడ్డాడు.

రాజకీయంగా ఆయన ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్న చంద్రబాబు వ్యాపారంగా మాత్రం కలిసి వస్తుంది. రిటైల్ విభాగంలో 124 హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్లు, హెరిటేజ్ ఫుడ్స్ లను అప్పట్లో చంద్రబాబు ఫ్యూచర్ రిటైల్ గ్రూపుకు అమ్మేశాడు. చంద్రబాబు చేతిలో ఇప్పుడు ఆ హెరిటేజ్ -ఫ్యూచర్ గ్రూపులో రూ.295 కోట్ల విలువైన 3.65శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నారు. హెరిటేజ్ కొన్నప్పుడు ఫ్యూచర్ గ్రూపు విలువ కేవలం రూ.8083 కోట్లు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ గ్రూపు ఏకంగా రూ.24713 కోట్లకు కొనుగోలు చేసింది. ఎలాగూ ఫ్యూచర్ గ్రూపులో చంద్రబాబు వాటా 3.65శాతం ఉంది. అంటే 24713 కోట్లలో 3.65శాతం అంటే రూ.907 కోట్లు. కాబట్టి చంద్రబాబు హెరిటేజ్ ను అమ్మిన 4 ఏళ్లలోనే ఏకంగా సంపాదించిన లాభం ఏకంగా 607 కోట్ల లాభం గడించారు. ఇలా కరోనా సమయంలో కుబేరులుగా మారిన వారిలో చంద్రబాబు కూడా చేరారు. రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్న సీబీన్ కు ఇదొక శుభవార్తనే చెప్పాలి.