దళిత ఎంఎల్ఏలకు చంద్రబాబు షాక్

ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబునాయుడు ఇద్దరు దళిత ఎంఎల్ఏలకు పెద్ద షాక్ ఇచ్చారు. జిల్లా నేతల సమీక్షా సమావేశంలో ఇద్దరు ఎంఎల్ఏలతో పాటు ఓ నియోజకవర్గ ఇన్చార్జిపై ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. జల్లా అధ్యక్షుడిపైనే అందరి ముందు మండిపడ్డారు. అందరి ముందు తమపై చంద్రబాబు మండిపడటంతో పాపం వాళ్ళ నలుగురు బిక్కచచ్చిపోయారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఎవరి మీద కోపమో ఇంకెవరి మీదో చూపినట్లు కనబడుతోంది. ఇంతకీ ఏమి జరిగింది తెలుసా ? రెండు రోజుల పర్యటన కోసం చంద్రబాబు ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి రెండు రోజులు కూడా రాత్రిళ్ళు జిల్లా నతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

 

ఆ సమీక్షా సమావేశాలే నేతలను అందరి ముందు పలుచన చేసింది. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టిడిపి పరిస్ధితి  ఏమీ బావోలేదు. ప్రతీ నియోజకవర్గంలోపు అంతర్గత వివాదాలు పెరిగిపోతున్నాయి. మంత్రులు నారాయణ, పరిటాల సునీతలు సర్దుబాటు చేద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు.

 

మిగితా నియోజకవర్గాల్లాగే ఎస్సీ నియోజకవర్గాలైన కొండెపి, యర్రగొండపాలెం ఎంఎల్ఏలు బాల వీరాంజనేయస్వామి, డేవిడ్ రాజు తో పాటు సంతనూతలపాడు నియెజకవర్గ ఇన్చార్జి బిఎస్ విజయకుమార్ పనితీరును కూడా సమీక్షించారు. ఆ సందర్భంగా పై ముగ్గురిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వీరిలో స్వామిని ఎలాపడితే అలా దులిపేశారు.

 

‘ నువ్వేం పుడింగివనుకుంటున్నావా ?…ఒక్కసారి ఎంఎల్ఏ అయినందుకే కళ్ళు నెత్తికెక్కాయా ?…నీవేమన్నా మహానాయకుడవని అనుకుంటున్నావా? ..విర్రవీగిపోతున్నావ్ అంటూ మండిపడ్డారు. నీవేమైనా డిక్టేటర్ వి అనుకుంటున్నావా ? నేను కన్నెర్రజేస్తే నీ పనేమవుతుందో తెలుసా ? ‘ అంటూ ఊగిపోయేటప్పటికి ఎంఎల్ఏ బిక్కచచ్చిపోయారు. ఎంఎల్ఏలో టెన్షన్ పెరిగిపోయి ఏ మాట్లాడాలో అర్ధంకాక చెమటలు పట్టేశాయి.

 

 

అదే విధంగా యర్రగొండపాలెం ఫిరాయింపు ఎంఎల్ఏ డేవిడ్ రాజుపైన కూడా ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. ఇక, సంతనూతలపాడు ఇన్చార్జి బిఎస్ విజయకుమార్ పైన కూడా మండిపోయారు. అందరి ముందు చంద్రబాబు తమపై ఫర్ అవ్వటంతో ఏమి సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్ధం కాలేదు. పనిలో పనిగా జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎంఎల్ఏ దామచర్ల జనార్ధన్ కు కూడా చివాట్లు పడ్డాయి.

 

కొండపి నియోజకవర్గంలో వర్గాలను పెంచి పోషిస్తున్నట్లు మండిపడ్డారు. జిల్లా పగ్గాలను అప్పగిస్తే అందరినీ కలుపుకుని పోవాల్సింది పోయి వర్గాలను పోషించటమేంటంటూ నిలదీశారు. దాంతో జనార్ధన్ కుడ ఏమీ మాట్లాడలేకపోయారు. మొత్తం మీద చంద్రబాబు సమీక్షలు చూస్తుంటే అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు లేదు.