2018 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అప్పటి ప్రధాని నరేంద్ర మోడీని ఎలాంటి మాటలు అన్నారు.? బీజేపీ మీద ఎన్నెన్ని విమర్శలు చేశారు.? ఇప్పుడు అదే నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏమేం గొప్ప మాటలు చెబుతున్నారు.? అయిపాయె.! ఆత్మగౌరవం లేదు.. అప్పడాల కర్రా లేదు.! బీజేపీ ముందర టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సాగిలా పడిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కి తాను పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించేశారు. బీజేపీ ఛానల్ రిపబ్లిక్‌లో చంద్రబాబు ప్రసంగించేశారు. ఆ రిపబ్లిక్ ఛానల్ కూడా, చంద్రబాబుని ఓ రేంజ్‌లో కీర్తించింది లెండి.
రిపబ్లిక్ కీర్తనలు.. మోడీపై చంద్రబాబు ప్రశంసలు.. వెరసి, బీజేపీ – టీడీపీ పొత్తుకి మార్గం సుగమం అయిపోయినట్లే. రేపో మాపో అధికారికంగా పొత్తుల విషయమై ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు, బీజేపీ పెద్దలు ఎవరో ఒకరు అధికారిక ప్రకటన చేయడమే తరువాయి.
ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు బీజేపీకి అపోషిన్ దాదాపు లేదనే చెప్పాలి. కాంగ్రెస్, వామపక్షాలున్నా.. వాటి ప్రభావం శూన్యం. బీజేపీకి అసలు ఏపీలో సీన్ లేదు. అయినా, ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ (అధికార వైసీపీ సహా) బీజేపీకి వంగి వంగి సలాం కొడుతున్నాయి.
బీజేపీ మద్దతు గనుక చంద్రబాబుకి దొరికితే, ఏపీలో తిరిగి అధికారం దక్కుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ – టీడీపీ – జనసేన.. ఈ కాంబో దాదాపు ఖాయమే.!