పార్టీ లేదు బొక్కా లేదు.. చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?

ఏపీలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. 2024 ఎన్నికల్లో కూడా ఫలితాలు భిన్నంగా వస్తే టీడీపీ చరిత్ర ముగిసినట్లే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లు పార్టీ అధికారంలో లేకపోతే ప్రస్తుతం టీడీపీ నేతలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు సైతం పార్టీ మారిన పాపానికి ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదు అంటూ చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా చంద్రబాబు నాయుడు సైతం అదే తరహా కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకు పార్టీ గురించి ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా అంటూ ఆయన చేసిన కామెంట్ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నిర్వీర్యమైపోతుందని పార్టీ గురించి తన ఆవేదనను వెల్లడించారు. పార్టీ ఆఫీసుకు వచ్చి బలప్రదర్శన చేస్తున నేతలపై సీరియస్ అవుతూ చంద్రబాబు ఈ కామెంట్లు చేశారు. చంద్రబాబు చేసిన కామెంట్లను వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతం తెగ వైరల్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకే పార్టీపై నమ్మకం లేదని ఆయన కామెంట్లతో అర్థమైంది.

2024 ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేయాల్సిన చంద్రబాబే పార్టీకి తలనొప్పిగా మారడంతో ఏ విధంగా స్పందించాలో టీడీపీ నేతలకు సైతం అర్థం కావడం లేదు.