ఏదైనా అబద్దాన్ని కూడా నిజం అని నమ్మించేలా చెప్పే టాలెంట్ అందరికీ ఉండదు. అయితే చంద్రబాబు మాత్రం అబద్ధాన్ని కూడా అతికినట్టు చెప్పగలరు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవ చేయగలరని నేనే సూచించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్జీవో పెట్టాలా? రాజకీయాల్లోకి రావాలా? అని ఎన్టీఆర్ అడిగితే ఎన్జీవో పెట్టడం వల్ల కొంతమందికి మాత్రమే బెనిఫిట్ కలుగుతుందని చెప్పానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు చెప్పింది నిజమో కాదో చెప్పడానికి సీనియర్ ఎన్టీఆర్ బ్రతికిలేరనే సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సమర్థించడానికి బాలయ్య ముందువరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మాత్రం అబద్దాలతోనే రాజకీయాలను కొనసాగిస్తూ మాటలతో మాయ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వల్లే 2004 ఎన్నికల్లో ఓడిపోయానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తన విజన్ గురించి మాత్రం చంద్రబాబు గొప్పగా తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ సెన్సార్డ్ వెర్షన్ లో వెల్లడించారు. చంద్రబాబు అబద్దాలు టీడీపీ అభిమానులకు సంతోషాన్ని కలిగించినా మిగతా వాళ్లకు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో కూడా ఓటమిపాలైతే టీడీపీ పరిస్థితి ఏంటని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు పార్టీకి నిజంగా అంత సత్తా ఉంటే 2024 ఎన్నికల్లో సొంతంగా ఈ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. 2024 ఎన్నికల ఫలితాలతో టీడీపీ రేంజ్ ఏంటో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల్లో కూడా ఓటమిపాలైతే టీడీపీ భవిష్యత్తు ముగిసినట్లేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.