పవన్ కళ్యాణ్‌ని నిండా ముంచేస్తోన్న చంద్రబాబు.!

వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి ప్రాసిక్యూషన్ చర్యల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి వుంది. ఈ విషయమై ఏం చేయాలో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోగలరు. జనసేన పార్టీకి లీగల్ టీమ్ వుంటుంది.. ఆ టీమ్ అన్ని వ్యవహారాల్నీ చక్కబెట్టగలుగుతుంది.

మధ్యలో చంద్రబాబు ఎందుకు దూరినట్టు.? ‘పవన్ కళ్యాణ్ మీద చర్యలకు ఉపక్రమిస్తారా.? ఇదేం పద్ధతి.? ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలిగానీ, ప్రాసిక్యూషన్ ఏంటి.? విపక్షాల గొంతు నొక్కుతారా.?’ అంటూ వైసీపీ సర్కారు మీద విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో ట్వీటేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఓ వైపు టీడీపీ శ్రేణులేమో సోషల్ మీడియా వేదికగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయ్. ‘మీకు గతి లేదు.. మేం పడేసే ఐదో పదో సీట్లు ఏరుకోండి..’ అంటూ జనసేనని అవమానిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.

ఇంకో వైపు, అధికార వైసీపీ, ‘ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకి దత్త పుత్రుడు’ అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తోంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే, చంద్రబాబు ‘పవన్ కళ్యాణ్‌కి మాట సాయం’ చేస్తున్నారు. అంటే, వైసీపీ చేస్తున్న విమర్శలు నిజమేనని, చంద్రబాబు తన చర్యల ద్వారా నిరూపిస్తున్నట్లవుతోందన్నమాట.

ఇవన్నీ ఎందుకు.? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు.. మేం ఎలాంటి ప్యాకేజీ ఇవ్వలేదు.. ఇవ్వాల్సిన అవసరం లేదు.. అని ఓ ట్వీట్ చంద్రబాబు వెయ్యొచ్చు కదా.? వెయ్యరుగాక వెయ్యరు. అదే చంద్రబాబు మార్కు రాజకీయం.

వైఎస్ జగన్ కంటే, రాజకీయంగా చంద్రబాబే పెద్ద సమస్య పవన్ కళ్యాణ్‌కి. అది ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోరంతే.