తెలుగుదేశం పార్టీలో సీనియర్ అనే పేరున్న నేత ఆయన. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. నెల్లూరు జిల్లా ప్రస్తావన వస్తే తప్పకుండా ఆయన పేరు వినిపిస్తుంది టీడీపీలో. అంతటి పలుకుబడి ఉన్నప్పటికీ ఆయనకు అదృష్టం మాత్రం లేదు. వరుసగా పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతూ వస్తున్నారు. అయినా వెనకడుగు వేయక పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. అలాగని ఆయనకు కేడర్, అభిమానులు లేరనుకుంటే పొరపాటే. ఆయనకు మాస్ లీడర్ అనే ఇమేజ్ ఉంది. అయినా కూడ ఎందుకో ప్రతిసారీ లెక్కలు తప్పుతూనే ఉన్నాయి. మొదట్లో కాంగ్రెస్ చేతిలో ఆడుతూ వచ్చిన ఆయన తర్వాత వైసీపీ చేతిలో పరాజయం చెందుతూ వస్తున్నారు.
2004 నుండి 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. అయినా చంద్రబాబు ఆయన మీదున్న అభిమానంతో టికెట్ ఇస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా కూడ ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అలా మంత్రివర్గంలో పనిచేయాలనే ఆయన కోరిక నెరవేరింది. సరే మంత్రిగా ఉండగా అయినా గెలవగలిగే పరిస్థితులు తెచ్చుకున్నారు అంటే అదీ లేదు. గత ఎన్నికల్లోనూ ఓడిపోయారు. దీంతో చంద్రబాబు అసహనానికి గురైనా కూడ ఏమీ అనలేదు. జిల్లాలో పార్టీ కీలక భాద్యతలు అప్పగించి చూసుకోమన్నారు. అయితే త్వరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు జరగనున్నాయి.
ఈ స్థానంలో నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవే సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట. వీటిలో సర్వేపల్లి సోమిరెడ్డి నియోజకవర్గం. అక్కడ ఆయనే టీటీడీపీకి పెద్దదిక్కు. కాబట్టి తిరుపతి ఉపఎన్నికల్లో గెలుపు కోసం ఆయన కూడ కృషి చేయాల్సి ఉంది. ఇప్పటికే బాబుగాడు ఆ ఎన్నికలకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఎలాగైనా గెలిచి టీడీపీకి ఇంకా జవసత్వాలు ఉన్నాయని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి కార్యాచరణ మొదలుపెట్టారు.
ఈ మేరకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతలను అలర్ట్ చేశారు. విజయం కోసం కష్టపడమని చెప్పారు. కానీ నేతలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారట. వైసీపీకి సిట్టింగ్ స్థానము, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వారి కంట్రోల్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా గెలుస్తాం. కష్టపడినా ఫలితం దక్కదు అనుకుని సైడ్ అయిపోతున్నారట. దీన్ని గమనించిన చంద్రబాబు నేతలందరికీ ఒక్కొక్కరిగా క్లాస్ తీసుకున్నారని మరీ ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితుడైన సోమిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకూడదని, నిర్లక్ష్యం తగదని గట్టిగానే హెచ్చరించారట.
Keywords: