హరికృష్ణ మృతి : హెలిక్యాప్టర్ లో వచ్చిన బాబు (వీడియోలు)

తన బావమరిది నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలియగానే హుటాహుటిన ఆంధ్రా నుంచి హెలిక్యాప్టర్ లో బయలుదేరారు టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు. ముందుగా బుధవారం ఉదయం హరికృష్ణ రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడ్డట్లు సమాచారం అందింది.

హరికృష్ణ పరిస్థితి తీవ్రంగా ఉందని చంద్రబాబుకు కబురు అందింది. అయితే వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి బయలుదేరేందుకు రెడీ అయ్యారు. అంతలోనే హరికృష్ణ మరణ వార్త బాబుకు చేరింది.

దీంతో వెంటనే హెలిక్యాప్టర్ లో ఆయన నార్కట్ పల్లి చేరుకున్నారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు. బాబు కారులోనే జగదీష్ రెడ్డి కూడా నార్కట్ పల్లి కామినేనికి వచ్చారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరుతెన్నులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. నార్కట్ పల్లిలో  చంద్రబాబు హెలిక్యాప్టర్ లో ల్యాండ్ అయిన వీడియో, జగదీష్ రెడ్డి రిసీవ్ చేసుకున్న వీడియో కింద ఉన్నాయి చూడండి.