పవన్ కళ్యాణ్ వెరైటీ డిమాండ్.. ఏపీలో నమ్మే నాయకులు ఇంకా ఉన్నారా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే షరతులు వర్తిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 50 అసెంబ్లీ సీట్లు కావాలని 7 ఎంపీ సీట్లు కావాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు మాత్రం ఆసక్తి చూపలేదని సమాచారం అందుతోంది.

ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే టీడీపీ భారీ స్థాయిలో నష్టపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి కావాలని కూడా భావిస్తున్నారని తనను సీఎం చేస్తా అనే పార్టీకే మద్దతు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని బోగట్టా. పవన్ కు హామీ ఇచ్చి డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రజల నుంచి, పవన్ అభిమానుల నుంచి చంద్రబాబుకు భారీ షాక్ తగిలే ఛాన్స్ అయితే ఉంది.

ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన విషయాన్ని మరిచిపోతున్నారు. జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయంటే ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వల్లే వస్తాయని భావిస్తే మాత్రం పొరపాటేనని చెప్పవచ్చు. పవన్ ప్రసంగం చంద్రబాబుకు షాకిచ్చే విధంగానే ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు కావాలంటే ఎన్నో వెరైటీ డిమాండ్లకు అవతలి పార్టీ అంగీకరించాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ తన గురించి తాను అతిగా ఊహించుకుంటున్నాడని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో వేసే అడుగుల విషయంలో తడబడుతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారో లేక సామాన్య నేతలా మిగిలిపోతారో చూడాల్సి ఉంది.