బాబును ఇరకాటంలో పాడేసిన అమరావతి రైతులు!

గత కొన్ని రోజులుగా తనదైన రాజకీయాలతో బిజీగా ఉన్న బాబుకు అమరావతి రైతులనుంచి ఒక రిక్వస్ట్ వస్తుంది. అదే… అసెంబ్లీకి వెళ్లమని! మార్చిలో జరగబోయే అసెంబ్లీ సెషన్స్ లో చాలా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టబోతుంది ఏపీ సర్కార్. దీంతో ఈసారి అసెంబ్లీలో బాబు అటెండెన్స్ కంపల్సరీ అంటున్నారు అమరావతి రైతులు!

వివరాళ్లోకి వెళ్తే… గడిచిన వర్షాకాల సమావేశాల్లో ఆవేశపడుతూ ఒక గంభీరమైన ప్రకటన చేశారు చంద్రబాబు. “ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ” అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. “నేను మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తాను” అంటూ శపథం చేశారు. అన్నట్లుగానే చంద్రబాబు 2022లో అసెంబ్లీ ముఖం చూడలేదు.

అయితే ఈ ఏడాది అసెంబ్లీ మార్చి 14 నుంచి సమావేశం కాబోతుంది. పైగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రత్యేకత ఉందంటున్నారు. కారణం… కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆ సమయంలో సీనియర్ అయ్యిన బాబు ఉంటే మరింత హుందాగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం.

ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లుని ఈసారి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అని అంటున్నారు. అదే జరిగితే.. ఆ సమయంలో సభలో చంద్రబాబు కచ్చితంగా ఉండాల్సిందే! అసెంబ్లీలో బాబు అమరావతిని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పడంతోపాటు.. రాజధానికి భూములు అనే విషయంపై అమరావతి రైతుల తరుపున వాదనను సమర్ధంగా వినిపించాల్సిన బాధ్యత బాబుపై ఉంది. దీంతో… అమరావతి రైతులు బాబు అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు!

బాబు ఏమో తాను సీఎం అయ్యకే అసెంబ్లీకి వస్తానంటూ భీస్మించుకుని కూర్చున్నారు. మరి ఈసారి తానునమ్మిన తనను నమ్మిన అమరావతి రైతుల కోసం బాబు అసెంబ్లీకి హాజరవుతారా.. లేక, రైతులను గాలికి వదిలేసి తన పంతం తాను నెగ్గించుకుంటారా అన్నది వేచి చూడాలి!