ఆంద్ర ప్రదేశ్ :ఒంగోలు నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క ఛాన్సంటూ మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటూ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్..ఒక్క ఛాన్సివ్వండంటూ జనాలను బతిమాలుకున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అలా ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని జగన్ మోసం చేస్తున్నట్లు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారంటూ చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.
ఒక్క చాన్సంటు అధికారంలోకి వచ్చిన జగన్ కు ఇదే చివరి చాన్సని చంద్రబాబు జోస్యం కూడా చెప్పారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ను జనాలు నమ్మే అవకాశాలే లేవని చంద్రబాబు బల్లగుద్ది మరీ చెప్పారు. తన రివర్సు పాలనతో రాష్ట్రాభివృద్ధి మొత్తాన్ని జగన్ రివర్సు చేసేసినట్లు ఆరోపించారు. ఇటువంటి వ్యక్తికి ఎవరైనా రెండోసారి అధికారం అప్పగిస్తారా ? అంటూ నేతలను ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో ఉల్లిధరలు ఎప్పుడైనా రూ. 100 పలికిందా ? అంటూ ప్రశ్నించారు. విద్యుత్తు బిల్లులు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైనా మూడు నాలుగు రెట్లు పెంచిందా అని అడిగారు. తమ హయాంలో పెట్రోలు డీజల్ వంటగ్యాస్ ధరలు పెరగటం ఎవరైనా చూశారా ? రోడ్లపై ధాన్యం పోసి రైతులు ఎప్పుడైనా తగలబెట్టారా ? అంటూ ఊగిపోయారు. కానీ అవన్నీ జగన్ ఏడాదిన్నర పాలనకే జరుగుతున్నాయని విమర్శించారు.