కేంద్ర నిఘా వర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఓ రాజకీయ పార్టీ అధినేతకు, రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పబడుతున్న అనైతిక కార్యకలాపాలపై సమాచారమిస్తాయా.? నివేదికలు అందజేస్తాయా.? లీకులు ఇస్తాయా.?
అసలు కేంద్ర నిఘా వర్గాల పనేంటి.? కేంద్రానికి నివేదికలు ఇవ్వడం. అసాంఘీక కార్యకలాపాల గురించి నిఘా వర్గాలు నిత్యం అప్రమత్తంగా వుంటాయి. కేంద్రానికి నివేదికలు ఇస్తాయి.. అాగే, రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్నీ అప్రమత్తం చేస్తాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వకుండా, ఆ నివేదికల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కేంద్ర నిఘా వర్గాలు ఇవ్వడమేంటి.? నివేదికలు కాదు, సమాచారమే అనుకుందాం.. పోనీ లీకులే అనుకుందాం. అలా సాధ్యపడుతుందా.?
రాష్ట్రంలో వాలంటీర్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, మహిళల మిస్సింగ్‌కీ వాలంటీర్లకూ లింక్ వుందనీ జనసేనాని నిన్న సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో మహిళల మిస్సింగ్ కేసులు కొత్తేమీ కాదు. మానవ అక్రమ రవాణా ఎప్పటినుంచో జరుగుతూనే వుంది. దాన్ని అరికట్టేందుకు అనేక చర్యలూ చేపడుతున్నాయి ప్రభుత్వాలు.
సరే, ప్రభుత్వాల వైఫల్యాల్ని ప్రశ్నించడం తప్పు కాదు. నిఘా వర్గాలు తనకు సమాచారమిచ్చాయనడమేంటి.? పైగా, వాలంటీర్ వ్యవస్థ మీద ఆరోపణలు చేయడమేంటి.? ఏలూరులో నిర్వహించిన వారాహి విజయ యాత్ర సభతో పవన్ కళ్యాణ్, వాలంటీర్ల అంశం ప్రస్తావించి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.
కేంద్ర నిఘా వర్గాలు గనుక ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే, పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి.? రాజకీయంగా ఆయన భవిష్యత్తు ఏంటి.?
