కర్నూలు జిల్లాలోని నంద్యాలకు మూడుసార్లు ఎంపిగా పోటీ చేసిన ఈ రెడ్డి గారు మరీ ఇంత అన్యాయని ఎవరు అనుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో నాలుగోసారి పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి గెలుపు నమ్మకమైతే లేదులేండి. ఇంతకీ విషయం ఏమిటంటే, రెడ్డిగారికి నందిపైపుల సంస్ధలున్నాయి. ధక్షిణాది రాష్ట్రాల్లో వ్యాపారాలు కూడా బాగానే నడుస్తున్నాయి. హఠాత్తుగా రెడ్డి ఇళ్ళు, వ్యాపార సంస్ధలపై సిబిఐ దాడులు చేయటం సంచలనంగా మారింది. ఇంతకీ సిబిఐ ఎందుకు దాడులు చేసింది ?
ఎందుకంటే, వ్యాపారాల కోసం అప్పు కావాలంటే రెడ్డిగారు బ్యాంకులకు సమర్పించిన పత్రాలే నకిలీవని తేలిందట. వ్యాపారాల విస్తరణ కోసం రెడ్డి గారకి బాగా డబ్బులు కావాల్సొచ్చిందట. అందుకని బ్యాకులకు అప్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పు కావాలంటే ఏవైనా ఆస్తులు చూపాలి కదా. బ్యాంకులకు రెడ్డిగారు చూసిన ఆస్తిపత్రాలు నకిలీవని విచారణలో తేలిందట.
మూడుసార్లు ఎంపిగా చేసిన రెడ్డిగారు, దశాబ్దాలుగా వ్యపారాలు చేస్తున్న రెడ్డిగారు చివరకు మోసం చేయటానికి ప్రయత్నించినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు భావించారట. అందుకనే ఆ విషయాన్ని నేరుగా రెడ్డిగారితో కాకుండా సిబిఐకి వర్తమానం పంపించారట. దాంతో సిబిఐ ఉన్నతాధికారులు వెంటనే బ్యాంకుకు చేరుకున్నారు. రెడ్డిగారు సమర్పించిన పత్రాలేంటి ? వాస్తవాలేంటి ? అనే విషయాన్ని నిర్ధారించుకున్నారట. తర్వాత రెడ్డిగారి ఇళ్ళు, వ్యాపార సంస్ధలపై దాడులు చేశారు. మొత్తినికి అప్పు కోసం రెడ్డిగారు చేసిన పనేమీ బాగాలేదంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.