టీడీపీ నేత రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో సీబీఐ సోదాల కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు సంబందించిన కేసులో రాయపాటి ఇంట్లో సీబీఐ బృందం తనిఖీలు చేస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ సంస్థలో రాయపాటి సాంబశివరావుకు వాటాలున్నాయి. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి నమోదైన కేసు విచారణ నిమిత్తం సోదాలు జరుగుతున్నాయి.

CBI Raids: టీడీపీ మాజీ ఎంపీ ఇంట్లో సీబీఐ సోదాలు.. కారణం అదేనా..?

ఉదయం 8 గంటల సమయంలో రాయపాటి నివాసానికి చేరుకున్న అధికారులు సెర్చ్ వారెంట్ చూపించి తనిఖీలు చేస్తున్నారు. ఇంట్లోని రూములు, కార్యాలయంలో చెక్ చేస్తూ పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీనే చేపట్టింది. పలు బ్యాంకుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుంది. ఇకపోతే, తాజా తనిఖీలకు సంబంధించి సీబీఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్పై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ పైన సీబీఐకి రాయపాటి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ మేరకు రాయపాటి ఇల్లు, కార్యాలయం తో పాటుగా శ్రీధర్ ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారట.