చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ కంపెనీ వ్యవపారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది హై కోర్టులో కేసు వేశారు. కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ సంస్ధలోని 14 కంపెనీల వ్యవహారాలపై అనుమానంగా ఉందని ఆరోపిస్తు రామారావు అనే న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశారు. కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ వ్యాపారాల్లో అనూహ్యంగా పెరుగుదల నమోదైన విషయాన్ని రామారావు తన పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబ ఆస్తుల్లో కానీ హెరిటేజ్ లెక్కలపై అనుమానంగా ఉందని న్యాయవాది చెప్పారు. అందుకే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ తో కూడా విచారణ చేయిస్తే కానీ వాస్తవాలు బయటకు రావంటూ న్యాయవాది పిటీషన్లో పేర్కొనటం గమనార్హం.
నిజానికి చంద్రబాబు కుటుంబ ఆస్తుల్లో పెరుగుదలపై ప్రతిపక్షాలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా కుటుంబ ఆస్తుల్లో విపరీతమైన పెరుగుదల నమోదైంది. ప్రతీ ఏడాది నారా లోకేష్ మొక్కుబడిగా చూపిస్తున్న లెక్కల్లోనే ప్రతిపక్షాలు లొసుగులను ఎత్తి చూపుతున్నాయి. లెక్కల్లో కనిపించే బొక్కలపై చేస్తున్న ఆరోపణలకు మాత్రం లోకేష్ సమాధానాలు చెప్పరు. అదే విధంగా హెరిటేజ్ సంస్ధ వ్యాపారాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎలా పెరిగాయంటే మాత్రం సమాధానముండదు. మొత్తం వ్యాపార సామర్ధ్యం ఎంత ? కడుతున్న పన్నులెంత అంటే మాత్రం సమాధానం చెప్పరు.
ప్రతిపక్ష నేతలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లెక్కలను మాత్రం లోకేష్ అడుగుతుంటారు. ప్రతీ ఏడు లోకేష్ ప్రకటిస్తున్న లెక్కలను ఎవరూ నమ్మటం లేదనే చెప్పాలి. ఏదో మొక్కుబడిగా లెక్కలు చూపిస్తున్నామంటే చూసిస్తున్నామని చెప్పుకునేందుకు మాత్రమే పనికొస్తాయి. లెక్కల్లో బొక్కలను అడిగే మీడియా కూడా లేకపోవటంతో మీడియా సమావేశం ఒక పెద్ద తంతుగా ముగిసిపోతుంది. తమ లెక్కలను ఎవరూ నమ్మటం లేదని చంద్రబాబు కుటుంబానికి కూడా బాగా తెలుసు. అయినా అదో పెద్దద డ్రామా. గతంలో ఇదే డ్రామాను చంద్రబాబు ఆడేవారు. ఇపుడు లోకేష్ ఆడుతున్నారంతే.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబును కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆస్తులు, వ్యాపారాలపై విచారణ చేయాలంటూ కోర్టులో కేసు దాఖలవ్వటం ఆశ్చర్యంగా ఉంది. సరే, కేసులో ఎంత వరకూ మెరిట్ ఉంది లేదు అన్నది విచారణకు టేక్ అప్ చేస్తే కానీ తెలీదు. ఎందుకంటే, ఈ మధ్యనే ప్రభుత్వంలో కుంభకోణాలు జరుగుతున్నాయని, ఐటి శాఖలో వేల కోట్ల ఫ్రాడ్ జరిగిందని మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కేసు వేస్తే హై కోర్టు పక్కనపెట్టేసింది. ఇఫుడీ కేసు వల్ల చంద్రబాబు కొంప ముణిగిపోతుందని ఎవరూ అనుకోవటం లేదు. కాకపోతే దాఖలైన పిటీషన్ విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.