వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులపై వరుసగా దాడుల జరగడం గురించి తెలిసిందే. అవినీతి అక్రమాల కేసులు, జైళ్లు అంటూ టీడీపీ నేతలు ఇబ్బందులకు గురయ్యారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టి జైళ్లకు వెళ్ళాల్సి వచ్చిందన్నది వాస్తవం. అయితే వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడులు వంటివి పార్టీపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం..డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ సహా పలు కేసుల్లో జగన్ సర్కార్ కి గట్టి దెబ్బ తగిలింది. ఇక మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో కమ్మ సామాజిక వర్గం అన్నది కీలక పాత్ర పోషించింది. అరెస్ట్ అయిన నాయకులు…రాజధాని రైతుల్లో ఎక్కువగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో జగన్ మోహన్ రెడ్డి పనిగ్గట్టుకుని కక్ష పూరిత చర్యలకు పూనుకున్నారని వ్యతిరేకత వ్యక్తమైంది. మరో వైపు వరుసగా టీడీపీ నేతలపై కేసులు వంటివి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చేలా ప్రతిపక్షం వ్యవహరించింది. తాజాగా ఈ నేపథ్యంలోనే పొలవరం ప్రాజెక్ట్ అవకతవకలపై జగన్ స్పీడ్ తగ్గించారని వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా మహేశ్వరరావు పొలవరంప్రాజెక్ట్ విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విచారణకు రంగం సిద్దం చేసింది.
నెక్స్ట్ వికెట్ ఉమనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జగన్ పై కమ్మ సామాజిక వర్గం బాగా హర్ట్ అయిందిట. ఈ నేపథ్యంలోనే ఉమపై విచారణ స్పీడ్ తగ్గించినట్లు సమాచారం. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ సాజాజిక వర్గం అధికంగా ఉంటుంది. అక్కడ రాజకీయాలు అన్ని ఆ సామాజిక వర్గం చుట్టూనే తిరుగుతాయి. ఈ నేపథ్యంలో ఉమపై ఇప్పుడే చర్యలు తీసుకుంటే ఆ వర్గం వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంటుందని..పక్కా ఆధారాలతో టైమ్ చూసి ఎటాక్ చేస్తే అన్ని లెక్కలు కుదురుతాయని..అందుకే ఉమ విషయంలో ఆయన విమర్శలు చేస్తున్నా..వైసీపీ నేతలు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.