జగన్ + సోము వీర్రాజు దెబ్బ చౌదరి ‘ గారికి గట్టిగా తగిలింది!

Somu Veerraju

రాజకీయాల్లో పార్టీలో స్థిరంగా ఉండేవారికి ఉన్న మర్యాద తరచూ పార్టీలు మారేవారికి ఉండదు. నాయకులు అన్నిసార్లు పార్టీలు మారడానికి సిద్ధాంతాలు, ఆశయాలు ఉండాల్సిన అవసరం లేదు. స్వలాభం కోసం కావచ్చు, అందులో ఎదో రాజకీయ వ్యూహం కూడా ఉండవచ్చు.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సుజనా చౌదరి కూడా పార్టీలు మారుతూ ఉండటం వల్ల తన మర్యాదను కోల్పోతున్నారు. మొదట టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, తరువాత కాలంలో బీజేపీలోకి వెళ్ళాడు. అయితే అయన బీజేపీలోకి వెళ్ళినా కూడా టీడీపీ నాయకులను కాపాడుతున్నాడని, వారికోసమే పని చేస్తున్నాడని, చౌదరికి అప్పటి ఏపీ బీజేపీ నాయకుడు అయిన కన్నా లక్ష్మి నాయరణ కూడా మద్దతు తెలిపారని వైసీపీ నాయకులు గతంలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి కాకపోవడానికి సుజనా చౌదరి, కన్నా లక్ష్మి నారాయనే కారణమని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

ఈ వ్యాఖ్యలే, సోషల్ మీడియా ప్రచారమే సుజనా చౌదరి రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఈ ప్రచారాలతో పాటు ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చౌదరిపై కేంద్ర బీజేపీ పెద్దలకు ఫిర్యాధు చేయడం వల్ల చౌదరి రాజకీయ పూర్తిగా డిఫరెంట్ టర్న్ తీసుకుంది. ఏపీలో బీజేపీ ఎదగాలంటే చౌదరి లాంటి నాయకులు ఉండకూడదనే నిర్ణయాన్ని తీసుకున్న బీజేపీ అధిష్టానం చౌదరిని అమరావతి నుండి హైదరాబాద్ రాజకీయాల్లోకి పంపుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి సరైన పోటీదారుడుగా మారడానికి, టీడీపీ మిగిల్చిన ప్రతిపక్ష స్థానాన్ని కూడా భర్తీని పూర్తీ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో చౌదరిని హైదరాబాద్ కు పంపారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏపీలో బీజేపీ రాజకీయాలను చెడ్డ పేరు తెచ్చిన చౌదరి తెలంగాణలో బీజేపీ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాడో వేచి చూడాలి అలాగే చౌదరికి హైదరబాద్ కు వెళ్ళడం వల్ల ఏపీలో బీజేపీ ఎలా ముందుకు వెళ్ళనుందో కూడా వేచి చూడాలి. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో చేసిన వ్యతిరేక ప్రచారం వల్ల, సోము వీర్రాజు రాజకీయ వ్యూహాలకు సుజనా చౌదరికి గట్టిగా దెబ్బ తగిలింది.