చంద్రబాబు మీద మోదీ మరొక దాడి, ఈ సారి ‘చేపలతో’

(లక్ష్మణ్ విజయ్)

 

తెలుగుదేశం సపోర్టు ఉంటే తప్ప భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో గెలవలేదు. టిడిపితో పొత్తు లేనపుడు ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి?  కాషాయం జండా ఎత్తుకుని బిజెపి తలకిందులై తపస్సు చేసినా బిజెపికి నాటి ఆంధ్రప్రదేశ్ లో సీట్లు రాలేదు. ఒక వేళ ఒకసారి వచ్చినా రెండో సారి రాలేదు. టిడిపితో చేతులు కలిపాకే బిజెపి దశ తిరిగిందిక్కడ.

 

అద్వానీ వంటి ఉన్నత స్థాయి నాయకుడు రథ యాత్ర జరిపినా ఆయనకు నమస్కారం పెట్టారు తప్ప బిజెపి ని తెలుగు వాళ్లు రానివ్వలేదు. ప్రధాని వాజ్పేయిని కొనియాడారు తప్ప బిజెపికి సొంతంగా గెలిచేంత సీన్ లేదిక్కడ. కారణం,తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలను ఏకం చేసి, తెలుగువాళ్ల కు గుర్తింపు తెచ్చింది. అందుకే మరొక పార్టీ ఇక్కడ అసవరం లేదు. నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టిడిపి మార్చేసింది. నేటి ఆంధ్రప్రదేశ్ తీరును కూడా lనేటి టిడిపి మారుస్తూ ఉంది.  2019లో 2014 నాటి బిజెపి, మోదీ హవా ఉండటం లేదు. ఇపుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రాగానే, బిజెపికి కళ్లు బైర్లు కమ్మాయి.

 

తెలుగుదేశంమద్దతు ఉంటేనే నాలుగయిదు అసెంబీ సీట్లు అథమం ఒక ఎంపి సీటు వచ్చేది. 2014లో నయితే రెండు ఎంపిసీట్లొచ్చాయి. మోదీ వ్యవహారం ఆంధ్రులకు ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రహించాక, మా బతుకు మే బతగ్గలం అన్న దీమాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వెనక చూడకుండా ఆత్మగౌరవంతో ఎన్డీయే నుంచి బయలకు వచ్చి పోరాటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు పన్నీర్ సెల్వం పడిఉంటాడని మోదీ వూహించి ఉంటాడు. అది జరగలేదు. టిడిపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. బిజెపి కంగు తినింది. దీనితో ఆంధ్రప్రదేశ్ ని పరోక్షంగా దెబ్బతీసేందుకు  మొదలుపెట్టింది.

ఆంధ్రప్రదేశ్ చాలా రంగాల్లలో నెంబర్ వన్. ఉదాహరణకు ఆక్వాఉత్పత్తుల ఎగుమతులలో  దేశంలోని ఎగుమతుల్లో 70 శాతం ఆంధ్రావే. దీని మీద దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 

చేపల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో ప్రధాన రాష్ట్రం. బీహార్, బెంగాల్ తో పాటు ఈశాన్యంలో ఉండే ఏడు రాష్ట్రాలు కూడా  ఆంధ్ర నుంచే చేపలను కొంటాయి. రోజూ వందలాది లారీలు ఈచేపలను తీసుకుని అస్సాంత సహా ఈ శన్యాన ఉన్న అన్ని రాష్టాలు కొంటాయి. ఈశాన్య రాష్ట్రాలన్నింటిని బిజెపి రకరకాల కుయుక్తులు ప్రయోగించి  కైవలసం చేసుకుంది.

 

ఇంతవరకు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, అమరావతికి నిధుల్లేవు. పోలవరానికి నిధుల్లేవు, కడప ఉక్కు లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు. సరే, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు, టిడిపి ప్రభుత్వం విఫలమయిందని అపవాదు వచ్చేలా చేసేందుకు చేసిన కుట్ర. అయితే, మరొక కుట్రకు  బిజెపి తెరలేపింది. ఇక్కడి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా ఈ శాన్య రాష్టాలలలోని బిజెపి ప్రభుత్వాలు ఉన్నట్లుండి ఆంధ్ర చేపలు బాగాలేవు,వాటిలో ఫార్మలిన్ ఉంది,  ఎగుమతులు వద్దు అని నిషేధం విధించాయి.

రాష్ట్రం  పేరు—- నిషేధం తేదీ

  1. అస్సాం— జూలై 11
  2. మేఘాలయ-జూలై 23
  3. నాగాలాండ్ –జూన్ 30
  4. మణిపూర్—-జూన్ 30
  5. గొవా———జూలై 18

 

బీహార్, బెంగాల్ ప్రభుత్వాలకు కనిపించని ఫార్మలిన్ బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలకే కనిపించిందా! జూలై ఒకటో తేదీనుంచి ఈ రాష్ట్రాలకు ఆంధ్రా చేపల ఎగుమతి ఆగిపోయింది. ఇది ఏడాది వందల కోట్ల బిజినెస్. ఇలా బిజినెస్ దెబ్బతీస్తే వ్యాపారస్థులు ‘బిజెపి తో పెట్టుకుంటే చస్తాం,’ అని భయపడేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు.

 

ఉదాహరణకు బిజెపి ప్రభుత్వం ఉన్న గోవాకూడా ఫార్మలిన్ పేరు చెప్పి ఇరుగుపొరుగు రాష్ట్రాలనుంచి చేపల దిగుమతిని నిషేధించి. గోవాకు ఇరుగుపొరుగు ఎవరు? ఒక వైపు మహారాష్ట్ర, మరొక వైపు కేరళ, కర్నాటక. కేరళ కర్నాటకలలో ఉండేది బిజెపి యేతర ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే మార్గాలను మూసేయాలి. ఇదే వ్యూహాన్ని బిజెపి ఈశాన్య భారత్ నుంచి ఆంధ్ర మీద అమలుచేస్తున్నది. దీని వల్ల ఎంత వ్యాపారం దెబ్బతింటున్నదో ఈ రోజు డెక్కన్ క్రానికల్ వివరంగా రాసింది.

 

ఉదాహరణకు ఎ  ఆజాద్ అనే అతను పశ్చిమగోదావరి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు భారీ చేపలను ఎగుమతి చేస్తాడు. ఆయన ఒక్కరే రోజు 50 ట్రకుల చేపలను పంపిస్తాడు. ఒక ట్రక్కు ధర రు.10 లక్షలు అంటే, ఆయన చేసే దినసరి వ్యాపరమే అయిదుకోట్లు. ఈ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలలో చేపలచెరువులున్నాయి. చేపలను నిల్వ వుంచేందుకు మేం ఎపుడూ ఫార్మలిన్ వాడటం లేదని, బీహార్, బెంగాల్ లనుంచి ఇలాంటి ఫిర్యాదు ఎపుడూ రాలేదని  జిల్లా రైతులు చెబుతున్నారు. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి వల్ల కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చేపలరైతులు, వ్యాపారస్థులు నష్టపోతారు.ఇలా బిజెపి ఆంధ్ర మీద దొంగదెబ్బ తీయాలనుకుంటున్నది. ఇది బిజెపి మోదీ-షా ఇలా బ్లాక్ మెయిల్  రాజకీయాలు కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకుంటున్నారు చాలా మంది వ్యాపారాస్థులు.