వైసీపీకి షాకిచ్చేందుకు బీజేపీ సిద్ధమైందా.. ఈడీ దాడుల వెనుక మర్మమిదేనా?

YCP Taking BJP Very Lite, The Reason is.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ పని చేసినా ఆ పని వెనుక రాజకీయపరమైన కారణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈడీ దాడుల ద్వారా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని భావిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఆయన ఇంట్లో సోదాలు జరగడం వైసీపీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. వైసీపీకి షాకిచ్చేందుకు బీజేపీ సిద్ధమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ కూతురు కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ నోటీసులు అందాయి. కేసీఆర్ ను దెబ్బ తీయాలనే ఆలోచనతోనే కవితను ఈ వివాదంలోకి నెట్టారని మరి కొందరు చెబుతున్నారు. కవిత వివాదంలో నిలిచిన కొన్నిరోజులకే వైసీపీ ఎంపీ ఇంట్లో సోదాలు జరిగాయి.

ఈ సోదాలలో ఏవైనా ఆధారాలు దొరికితే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీపై అవినీతి విషయంలో ఆరోపణలు ఒకింత తక్కువనే సంగతి తెలిసిందే. ఒక్క స్కామ్ లో వైసీపీ నేతలు పట్టుబడినా ప్రతిపక్ష పార్టీలకు మాత్రం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వైసీపీ అవినీతికి పాల్పడుతోందని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే పార్టీకి నష్టం కలుగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంను బీజేపీ సీరియస్ గా తీసుకుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల నేతలే కీలకమని తేలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాబోయే రోజుల్లో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.