నారా చంద్రబాబు నాయుడుగారి పరిస్థితి ఏపీలో దారుణంగా ఉంటే తెలంగాణలో దుర్భరంగా ఉంది. రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ తిరస్కరణ దశల వారీగా జరిగింది కాదు ఒక్కసారిగా జరిగిపోయింది. 2014 ఎన్నికల్లో తెలంగాణ జనం టీడీపీని తిప్పికొట్టారు. ఇక గత ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన టీడీపీని అస్సలు సహించలేకపోయారు. ఆ ఎన్నికలతోనే తెలుగుదేశం కథ కంచికి చేరిందని అర్థమైపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీయే కాదు ఆ పార్టీతో దోస్తీ చేసిన కాంగ్రెస్ కూడ నేలమట్టమైంది. అప్పటి నుండి కొద్దికొద్దిగా కూలుతూ వచ్చి చివరికి ఈరోజు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అలా తెలంగాణలో తెలుగుదేశంతో ఎవరు దోస్తీ చేసినా నష్టపోక తప్పదనే నమ్మకం ఏర్పడిపోయింది.
ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ విషయంలోనే భారతీయ జనతా పార్టీ విషయంలోనూ జరిగింది. ఈ ఎన్నికల్లో భాజపా 48 సీట్లు సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైపోయింది. అయితే 2016 ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి దారుణంగానే ఉంది. ఆ ఎన్నికల్లో 4 స్థానాలను మాత్రమే గెలవగలిగింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీకి దిగాయి. పొత్తుల్లో భాగంగా బీజేపీ 61 డివిజన్లలో పోటీచేసి 4 చోట్లే గెలవగా తెలుగుదేశం మిగిలిన స్థానాల్లో పోటీచేసి కేవలం ఒక్కటంటే ఒక్కటే డివిజన్ గెలిచింది. ఆ ఫలితాలతో టీడీపీతో దోస్తీ ఎంత ప్రమాదకరమో బీజేపీకి తెలిసొచ్చింది. అంతకు కముందు 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీతో జతకట్టి ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది.
ఈ వరుస అనుభవాలు ఇక టీడీపీ జోలికి వెళ్లకూడదని బీజేపీ బాగా అర్థమయ్యేలా చేశాయి. అందుకే 2016 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇక ఆ ఎన్నికలో బాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఏమైందో అందరికీ తెలుసు. అప్పటి నుండి ఒంటరిగా ముందుకువెళ్లడమే ఉత్తమంగ అనుకున్న బీజేపీ ఆ మార్గాన్నే ఫాలో అయి 2018 లోక్ సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఫలితం ఎంతో అపురూపమైనది. ఈ ఫలితాలతో బీజేపీ రానున్న రోజులు తమవే అని ధైర్యంగా ఉన్నారు. అలా ఒకప్పుడు చంద్రబాబు చేయి పట్టుకుని నానా కష్టాలు పడిన కమలం పార్టీ ఆయన నుండి దూరంగా జరిగి ఇప్పుడు తెరాసనే బెంబేలెత్తించే స్థాయికి ఎదిగింది.