బీజేపీతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దోబూచులాట ఏట్టకేలకు ముగిసింది. బీజేపీతో పొత్తు విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో ఆయన పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీల సంఖ్య మూడుకు చేరుకుంది. రాజకీయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్న సందర్భంలేదు. 2014లో టీటీపీతో పొత్తుకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ బాగా లబ్ది పొంది అధికారం చేప్టంది. కొంత కాలం వారితో సాగిన పవన్ కల్యాన్ ఆ తర్వాత తెగదెంపులు చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు కమ్యూనిష్ట్‌లతో జత కట్టారు. అయితే ఎన్నికల్లో సొంతగా కూడా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయాలకూ దూరంగా వస్తూ వచ్చారు. రాజధాని తరలింపు నే పథ్యంలో జరుగుతున్న ఆందోళనలో ఇటీవల కొంత చురుగ్గా వచ్చారు. బీజేపీ తెరవెనుక ప్రయత్నాలను కొనసాగిస్తున్న ఆయన ఒక్కసారిగా బీజేపీ పెద్దల ఆశీస్సులతో రాష్ట్రంలో పొత్తు సిద్ధమయ్యారు. ముచ్చటగా మూడోసారి జాతీయ పార్టీతో చేతులు కలిపిన ఆయన వ్యవహారాలశైలిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ఏమాత్రం ప్రజాదరణ లేని బీజేపీతో కొనసాగటం వల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో ఆయనకే తెలియాలి.