పరిపాలన విషయంలో ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పాలనలో తనదైన శైలి చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే న్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఇలా ప్రజల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరు రావడం బీజేపీ నాయకులకు గిట్టడం లేదు. అందుకే బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.
జగన్ దాటిని భయపడుతున్న బీజేపీ నాయకులు
ప్రజల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న క్రేజీ ఏంటో 2019 ఎన్నికల్లో దేశం మొత్తం తెలిసిందే. అయితే ఈ క్రేజ్ ను తగ్గించడానికి టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా నిలవానుకుంటున్న బీజేపీ ఇంకా ఎక్కువగా జగన్ ను విమర్శిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పధకం జగన్ తాజాగా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పందిస్తూ… ప్రజల సొమ్ముతో ఉచిత పథకాలను ప్రవేశపెట్టడం సరికాదని, జగన్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను చూస్తే బీజేపీ నాయకులు జగన్ ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారో అర్ధమవుతుంది. ఏ ప్రభుత్వమైనా ప్రజా ధనంతోనే పథకాలను ప్రవేశపెడుతుంది అంతే నాయకుల సొంత డబ్బుతో ప్రవేశపెట్టారు. ఈ బేసిక్ విషయాల గురించి ఆలోచించకుండా కూడా జగన్ పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతలు మరీ కేంద్రంలో బీజేపీ నాయకులు తమ సొంత డబ్బుతో పథకాలను ప్రవేశపెడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో జగన్ కు వస్తున్న ఆదరణను చూసి భయపడుతున్న బీజేపీ నాయకులు ఇలా అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తుంది.