AP: పెన్షన్ అనర్హులకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్… వెనక్కి చేయాలంటూ?

AP: ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్లను పెంచుతూ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెంచిన పెన్షన్ కూడా అందజేశారు. అయితే ప్రతినెల పెన్షన్ల కోత విధిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది అర్హత లేకపోయినా పెన్షన్లను అందుకున్నారని ఆరోపణలు చేస్తూ వచ్చారు .ఈ క్రమంలోనే అనర్హుల పై వేటుకు సిద్ధమయ్యారు.

ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో భాగంగా పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి .ఎవరైతే పెన్షన్ లో అనర్హత కలిగి ఉన్నప్పటికీ పింఛన్ తీసుకుంటూ ఉన్నారు వారిపై అనర్హత వేటువేయాలని అదేవిధంగా ఇదివరకు ఇచ్చిన డబ్బులను రికవరీ చేయాలి అంటూ ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక పేన్షన్ డబ్బులను రికవరీ చేయడమే కాకుండా ఇలా వారికి ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు అందజేసి ఉంటారో అలాంటి డాక్టర్లపై చట్టపరంగా చర్యలు (ప్రాసిక్యూట్) తీసుకోవాలని అన్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రుల నుంచే బోగస్ సర్టిఫికెట్లు వస్తున్నాయన్న చంద్రబాబు.. అలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తుంది.

ఈ కార్యక్రమం మార్చి 31, 2025 నాటికి పూర్తవుతుంది. ఇలా అనర్హులై, బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి పెన్షన్ పొందిన వారిని గుర్తించడమే కాదు.. వారు తిరిగి ఆ పెన్షన్ మనీని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అనర్హులకు ఇకపై టెన్షన్ తప్పదు. వారు తిరిగి చెల్లించాలి అంటే వారు ఎక్కడి నుంచి ఈ డబ్బును తిరిగి తీసుకు వస్తారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే కనుక నిజమైతే ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.