భూమా అఖిలకు ఊహించని షాక్

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఆళ్ళగడ్డలో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియకు భారీ షాక్ తగిలింది. మొన్నటి వరకూ టిడిపికి గట్టి మద్దతుదారుడుగా ఉన్న మాజీ ఎంపి  గంగుల ప్రతాప్ రెడ్డి పార్టీకి రాజీనామ చేశారు. టిడిపికి రాజీనామా చేయటమే కాకుండా వైసిపిలో చేరారు.  పోలింగుకు మరో వారం రోజులుండగా ప్రతాప్ రెడ్డి నిర్ణయంతో అఖిలప్రియకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

మంత్రికి వ్యతిరేకంగా వైసిపి తరపున పోటీ చేస్తున్న గంగుల బ్రిజేంద్రరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తన మద్దతుదారులతో పాటు నియోజకవర్గంలోని ప్రజలకు విజ్ఞప్తి  చేయటంతో అఖిలకు అసలేం జరుగుతోందో అర్ధం కావటం లేదు. అఖిల పరిస్ధితి అసలే అంతంతమాత్రంగా ఉంది. జిల్లాలో సీనియర్లను, నియోజకవర్గంలో పెద్దలను ఎవరినీ లెక్క చేయకుండా తలబిరుసుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు మంత్రిపై బాగా ఉన్నాయి. దాంతో భూమా కుంటుంబ వ్యతిరేకులంతా వైసిపిలో చేరిపోగా మరికొందరు  సైలెంట్ గా ఉన్నారు.

నియోజకవర్గంలో తమకున్న పట్టుతో పాటు గంగుల లాంటి బలమైన కుటుంబం మద్దతుంది కాబట్టి గెపు సునాయాశమనే అనుకున్నారు. కానీ హఠాత్తుగా గంగుల ప్రతాప్ రెడ్డి కొట్టిన దెబ్బతో మంత్రి మైండ్ బ్లాంక్ అయిపోయింది. గంగుల తాజా నిర్ణయంతో అఖిల గెలుపు కష్టమని తేలిపోయింది. తన నివాసంలో మద్దతుదారులతోను, కుటుంబసభ్యులతోను  సమావేశమైన ప్రతాపరెడ్డి గంగుల బిజేంద్రరెడ్డిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని పిలుపిచ్చారు. బిజేంద్రరెడ్డి అంటే ఎవరో కాదులేండి. ప్రతాపరెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర రెడ్డి సోదరుడి కొడుకే.

తాజాగా గంగుల తీసుకున్న నిర్ణయంతో మంత్రి వ్యతిరేకులంతా దాదాపు ఏకమైపోయినట్లే. సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి, మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎస్పీవైరెడ్డి కుటుంబం అంతా మంత్రికి వ్యతిరేకమైపోయారు. ఎస్పీవైరెడ్డి జనసేన తరపున పోటీ చేసి టిడిపి ఓట్లు చీల్చుతుంటే మిగిలిన ఇద్దరు అఖిలకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు నియోజకవర్గంలో బాగా ప్రచారం జరుగుతోంది. మరో వారం రోజుల ప్రచారంలో మంత్రి అఖిలకు చుక్కలు కనబడటం ఖాయమనే అనిపిస్తోంది.