Vallabhaneni Vamsi: వంశీకి కస్టడీ షాక్: కోర్టు కఠిన ఆదేశాలు

టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు లో వైసీపీ నేత వల్లభనేని వంశీకి పెద్ద షాక్ తగిలింది. ఈ కేసులో వంశీని ఇంకా విచారించాల్సిన అవసరముందని పోలీసులు కోర్టును కోరగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజుల కస్టడీని అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. కానీ, ఈ కస్టడీపై కోర్టు కొన్ని కఠిన షరతులు విధించింది. వంశీని విజయవాడ పరిధిలోనే విచారించాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది.

అదనంగా, వంశీ న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నలు అడగాలని, నిబంధనలు పాటించకపోతే కస్టడీని తక్షణమే రద్దు చేసే హక్కు తమకుందని కోర్టు పోలీసులకు గుర్తు చేసింది. విచారణ సమయాలపైనా కోర్టు స్పష్టత ఇచ్చింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలీసులు ప్రశ్నలు అడగాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది. అలాగే, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మెడికల్ పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

వంశీ ప్రస్తుతం వెన్ను నొప్పితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, కోర్టు అతనికి విశ్రాంతి కోసం బెడ్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆరోగ్య పరమైన ఏమైనా సమస్యలు ఎదురైతే, వెంటనే వైద్య సహాయం అందించాల్సిన బాధ్యత కూడా పోలీసులదే అని కోర్టు పేర్కొంది. మొత్తంగా, ఈ కేసు మరింత జటిలం అవుతోంది. వంశీపై కస్టడీ విధించడం ఒకవైపు, కోర్టు విధించిన కఠిన నియమాలు మరోవైపు వంశీ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఈ విచారణలో కొత్త అంశాలు బయటకు వస్తాయా? వంశీపై మరింత కఠిన చర్యలు ఉంటాయా అన్నది వేచిచూడాలి.

ఆపవమ్మా కూర్చో || Varudu Kalyani Vs Vangalapudi Anitha || Varudu Kalyan Satires On Budjet  || TR