ప్రజెంట్ వైసీపీలో ఆ పదవి చాలా హాట్ గురూ.. ఎవరికి దక్కుతుందో అదృష్టం ?

Ysrcp

ఇతర పార్టీలు సరైన నాయకులు లేక నానాతంటాలు పండుతుంటే  వైకాపా  మాత్రం లెక్కకు మించిన లీడర్లు ఉండటంతో ఇబ్బందులకు గురవుతోంది.  ఏకంగా 153 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో పదవులకు పోటీ విపరీతంగా పెరిగిపోయింది.  ఎన్నికల్లో గెలిచినా చాలామంది నేతలు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.  వారిలో సీరియర్లు కూడ ఉన్నారు.  అందుకే పదవి దక్కక చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు.  ఈ సహనాన్ని జగన్ కు తెలిసేలా చేశారు కూడ.  కానీ చేయడానికి ఏమీ లేదు కాబట్టి జగన్ సైతం కాస్త ఓపికపట్టమని చెప్పారు.  భారీ ఎత్తున బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అసంతృప్తిలో ఉన్న నేతల అనుచరులకు చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఇచ్చి కాస్త కూల్ చేశారు.  ఇంకొన్ని కార్పొరేషన్లకు కూడ ముఖ్యులను నియమించి మాట నిలబెట్టుకున్నారు.  ఇంతా చేసినా అసంతృప్తులు ఇంకా చాలామందే కనబడుతున్నారు.  

Big competition for crucial posts in YSRCP

తాజాగా జగన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.  అదే కొత్త జిల్లాల ఏర్పాటు.  13 జిల్లాలను 25 లేదా, 26 జిల్లాలుగా విభజించనున్నారు.  అందులో భాగంగానే 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించనున్నారు.  ఈ జోన్లకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయనున్నారు.  ఈ అభివృద్ధి మండళ్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించాల్సి ఉంటుంది.  అభివృద్ధి మండలి చైర్మన్ అంటే కేబినెట్  ర్యాంక్  కలిగిన హోదా అయ్యే అవకాశం ఉంది.  అంటే మంత్రివర్గంలోని మంత్రికి అందిన మర్యాదలే అభివృద్ధి మండలి చైర్మన్ కు కూడ ఉంటాయన్నమాట.    విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ప్రత్యేక జోన్లను ఏర్పాటుచేసి అభివృద్ధి మండళ్లను ఏర్పాటుచేస్తారు.  

ఇప్పుడు ఈ నాలుగు చైర్మన్ పదవుల కోసం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది.  చైర్మన్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలే ఉండనున్నారు.  మంత్రులకు ఎలాగూ పదవులు ఉన్నట్టే కాబట్టి నాలుగు పదవుల్లో నాలుగు లేదా మూడు ఎమ్మెల్యేలకు దక్కే అవకాశం ఉంది.  అందుకే తీవ్రమైన పోటీ మొదలైంది.  ఎమ్మెల్యేలు ఎవరికివారు పైరవీలు స్టార్ట్ చేశారు.  ఇప్పటికే విజయనగం జిల్లాలో కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర,లాంటి సీనియర్లు పదవి రేసులో ఉన్నారు.  వీరితో పాటే కొత్త ఎమ్మెల్యేలు కూడ పదవి మీద ఆశలుపెట్టుకుని ఉన్నారు.  కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడ ఇదే పరిస్థితి.  గతంలో పదవి దక్కని, అసంతృప్తిలో ఉన్న సీనియర్లు ఈసారి మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నట్టే సంకేతాలు పంపుతున్నారు.