హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పి, ఆ తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల కోసమే అంటూ జనసేస పార్టీ పెట్టి, ఓ లీడర్‌గా రాజకీయాల్లో ముందుకు సాగుతున్న పవన్, మరో నాయకుడికి మద్దతు ఇవ్వడం తనకు నచ్చలేదని చెప్పడమే కాకుండా, పవన్ కళ్యాణ్‌ను ఊసరవెల్లితో పోల్చారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. దీంతో ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేసిన పవన్ వీర భక్తులు ఓ రేంజ్‌లో ఆయన పై కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ముందుగా మెగా బ్రదర్ రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ గుట్టు ఇదే అంటూ సోషల్ మీడియలో పెద్ద లేఖే రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రకాష్ కూడా నాగబాబుకు కౌంటర్ ఇవ్వడం జరిగిపోయింది. అయితే ఇప్పడు పవన్ కళ్యాణ్ వీర భక్తుడు కమెడియన్ అండ్ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేశారు. తన దేవుడిని ఏమైనా అంటే అస్సలు సహించేది లేదని ప్రకాష్ రాజ్ పై సోషల్ మీడియలో ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్.
తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్న బండ్ల గణేష్, ఎన్నికల మూమెంట్ కావడంతో మాట్లాడటం ధర్మంకాదని, రాజకీయాలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, అయితే పవన్ లాంటి మహోన్నతమైన వ్యక్తిని టార్గెట్ చేస్తే మాత్రం తాను ఊరుకోనని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని వ్యక్తిత్వం, నిజాయితీ, నిబద్ధతలో పవన్‌ను మించిన వారు లేరని రాజకీయంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చుగానీ, వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మాత్రం సహించేది లేదన్నారు.
ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లను పరిచయం చేసిన ఘనత పవన్ కళ్యాణ్‌దే అని, పవన్ పెట్టిన భిక్షతోనే తాను ఈరోజు ఇంత పొజిషన్‌లో ఉన్నానని మరోసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేష్. పవన్ వీర భక్తుడు కాబట్టి ఈయనకు కోపం వచ్చింది సరే.. కానీ ఆ కోపానికి అర్ధం ఉండాలి కదా.. పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ నేపధ్యంలోనే చేసినవే.. పవన్ జనసేనానిగా పొలిటికల్ జర్నీ బేస్ చేసుకుని తన అభిప్రాయం చెప్పాడు. పవన్‌ను పర్సనల్‌గా పవన్‌ను ఎక్కడ టార్గెట్ చేశాడు. ఏదేమైనా పవన్ భక్తులు కదా అర్ధం పర్ధం లేకుండా తికమకగా కామెంట్స్ చేయడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని పలువురు చర్చించుకుంటున్నారు.