ప్రస్తుతం హైదరాబాద్ లోని మైత్రీ మూవీస్ ఆఫీసుపై ఇన్ కం టాక్స్ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదేతర ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఈ వ్యవహారంపై ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కారణం… ఏపీ మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత అయిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టారని జనసేన నేతల విమర్శలు చేయడం!
అవును… మైత్రీ మూవీస్ సంస్థలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన బంధువు భాస్కర రెడ్డిలు పెట్టుబడులు పెట్టారని వైజాగ్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. సరే ఇందులో తప్పేమీ లేదు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో సర్కిల్ ఉంటే.. నిర్మాణాల్లో డబ్బులు పెట్టోచ్చు.. ఫైనాన్స్ చేయొచ్చు. కానీ… అధి అధికారికంగా చేయాలి తప్ప.. బ్లాక్ మనీ రూపంలో చేయకూడదు. అయితే… ఇప్పుడు మూర్తి యాదవ్ చేస్తున్న విమర్శలు… మైత్రీలో బాలినేని డబ్బులు ఉన్నాయనా.. అవి బ్లాక్ గా ఉన్నాయనా అన్నదే కీలకం!
ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఒకవైపు మైత్రీ మూవీస్ లో బాలినేని అండ్ కో పెట్టుబడుల మీద మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయబోతున్నారు. మరో వైపు మైత్రీ మూవీస్ తో పవన్ సినిమా చేస్తున్నారు! దీంతో… ఈ వ్యవహారంపై క్లారిటీ మిస్సవుతుంది. మరోవైపు తనకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా మైత్రీలో పెట్టుబడిగా లేదని బాలినేని చెబుతూ… తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న, వార్తలు రాస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్నారు.
దీంతో… ఈ విషయంలో త్రిముఖ పోటీ తెరపైకి వస్తుంది. సపోజ్ జనసేన నేతలు ఆరోపిస్తున్నట్లు బాలినేని డబ్బులు మైత్రిలో ఉంటే… అది పవన్ కు తెలిసే సినిమా చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా?… మైత్రితో పవన్ సినిమా చేస్తున్నారని తెలిసి కూడా.. జనసేన ఎమ్మెల్యే ఆ సంస్థపై కామెంట్లు చేశారా? ఆ సంగతి ముందుగానే పవన్ కు తెలుసా.. తెలియదా? పవన్ అనుమతి తీసుకోకుండానే.. పవన్ తో సాన్నిహిత్యంగా ఉండే సంస్థపై జనసేన నేత ఇంత భారీ విమర్శ చేసేశారా?
ఇక్కడ విచిత్రం ఏమిటంటే… ఆరోపణలు ఎదుర్కొన్న బాలినేని & కో ఈ విషయంపై రియాక్ట్ అయ్యి సమస్యను లైట్ తీసుకోగా…. విమర్శ చేసిన జనసేన లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారడం! మరి ఈ విషయాలపై జనసేన అధినేత ఏమైనా స్పందిస్తారా? జనసేన కార్పొరేటర్ చేసిన విమర్శలపై గట్టిగా నిలబడతారా? లేక.. మూర్తి యాదవ్ ను మందలించి వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి!