నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి’ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. నిజానికి, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెరవెనుకాల, తెర ముందూ అన్నీ తానే అయి చూసుకుంటున్నారు. చూసుకోవాలి కూడా.!
ఆ స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు.. ఈ నందమూరి బాలకృష్ణ.. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపడుతున్నందుకు అభినందించి తీరాల్సిందే. కానీ, అసలు ఆ అర్హత నందమూరి బాలకృష్ణకి వుందా.?
ఎన్టీయార్ గొప్పోడు.. ఎన్టీయార్ దేవుడు.. ఎన్టీయార్ అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం.. ఇదీ ‘ఎన్టీయార్ శత జయంతి వేడుకల’ సందర్భంగా వక్తల ప్రసంగాల సారాంశం. ఏ ఎన్టీయార్ గొప్పోడు.? ఏ ఎన్టీయార్ దేవుడు.? ఏ ఎన్టీయార్ అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం.? అన్న ప్రశ్నలు వస్తాయ్ మరి.!
ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీయార్ చివరి రోజులు.. అత్యంత బాధాకరం.! ఆ ఎన్టీయార్ అయితే, తెలుగుదేశం పార్టీకి అస్సలు నచ్చడు. అందుకే కదా, ఆ ఎన్టీయార్ మీద చెప్పులు వేసింది. ఆ ఎన్టీయార్, నందమూరి బాలకృష్ణకి కూడా అప్పట్లో నచ్చలేదు.!
కుటుంబ సభ్యులే స్వర్గీయ ఎన్టీయార్‌ని దూరం పెట్టారు. తన బిడ్డలే తనను నాశనం చేసిన వైనాన్ని స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మ క్షమిస్తుందా.? ఛాన్సే లేదు.