అసెంబ్లీలో బాలయ్య విజిల్స్… “సర్టిఫికెట్” కు న్యాయం చేస్తున్నారా?

శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. చట్ట సభ ప్రతిష్టను దిగ­జా­రుస్తూ, స్పీకర్‌ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఇక ప్రత్యేకంగా బాలకృష్ణ చేసిన వికృత చేష్టలు మరొకెత్తు. మీసాలు తిప్పడం, తొడ గొట్టడం, అసభ్యకరంగా సైగలు చేయడం జరిగాయి.

ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా దాదాపు అలానే ప్రారంభమైన నేపథ్యంలో… టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇది సినిమా హాలు కాదు, బహిరంగ సభా కాదు… ప్రజాస్వామ్య దేవాలయం అనే విషయం మరిచినట్లుగా ప్రవర్తించారు. ఇందులో భాగంగా విజిల్స్ వేశారు.

రెండో రోజు సభలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్స్ వేస్తూ.. అది తనమార్కు నిరసన అన్నట్లుగా వ్యవహరించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో బాలకృష్ణకు పిల్ల చేష్టలు పోలేదని కొందరు అంటుంటే… తనవద్ద ఉన్న సర్టిఫికెట్ కు న్యాయం చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

కాగా… మొదటిరోజు అసెంబ్లీ సమావేశాల్లో తొడగొడుతూ, మీసం తిప్పుతూ కనిపించిన బాలయ్యను స్పీకర్ మందలించి, మొదటి తప్పుగా భావించి, మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన సస్పెండ్ అయ్యి బయటకు వెళ్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలవైపు చూసి అసభ్యంగా సైగలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… అసెంబ్లీ అంటే దేవాలయం అని చెప్పుకొచ్చారు. మరళా ఈ రోజు విజిల్స్ వేస్తూ కనిపించారు బాలకృష్ణ!