బ్రేకింగ్ : మరో సెన్సేషనల్ పోస్ట్..ఏపీ ప్రభుత్వానికి బాలకృష్ణ సీరియస్ వార్నింగ్.!

గత రెండు మూడు రోజులు నుంచి ఏపీలో పరిస్థితులు ఎటెటో దారి తీశారు. దీనితో నందమూరి అభిమానులు చాలా ఆగ్రహంగా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంపై ఉన్నారు. ఇక దీనితో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కూడా స్టార్ హీరోలు అయినటువంటి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సహా సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ లు తమ స్పందనలు ఆల్రెడీ తమదైన శైలిలో తెలియజేసారు. మరి లేటెస్ట్ గా అయితే బాలయ్య మరోసారి తన స్పందనను వ్యక్త పరచారం సెన్సేషన్ గా మారింది.

మరి ఈసారి బాలయ్య ఏమని పోస్ట్ చేసారంటే “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..” అంటూ కాస్త సీరియస్ వార్నింగ్ తో షాకింగ్ పోస్ట్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Jpuq7Scc5BiCuRDZWw4YWorjT49A2PG8q36m7nsHS2CC2pQdMTVbRhr9fy1EHGmTl&id=100044176462099