బీజేపీ అధిష్టానం జగన్‌తో స్నేహం చేస్తున్నట్టే ఉంటుంది కానీ సహాయం చేయదు. మద్దతు ఇస్తున్నట్టే ఉంటుంది కానీ కావాల్సిన పనులు చేసి పెట్టదు. ఇది వారి రెండు నాల్కల వైఖరికి నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి సైతం రాష్ట్రం పట్ల బీజేపీ తీరు ఎలా ఉందో స్పష్టంగా తెలుసు. ఈ ఆలోచనలతో జగన్ న్యాయవ్యవస్థ మీద సంధించిన లేఖను చూస్తే పలు అనుమానాలు మదిలో మెదలడం కామన్. జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించడం న్యాయవ్యవస్థల మీద ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని అనేకమంది న్యాయనిపుణులు అంటున్నారు. ఇది తప్పకుండా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని వాదిస్తున్నారు.
తాజాగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సైతం లేఖలో జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఇలా చేయడం ధిక్కరణ చర్యే అన్నట్టు వ్యాఖ్యానించారు. అలాగే సీజేఐ పరిధిలో ఉన్న అంశంలో తాము కలుగజేసుకోబోమని కూడ అన్నారు. అటార్నీ జనరల్ ఇలా మాట్లాడటం జగన్‌కు కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. అయితే అటార్నీ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి అని, కేంద్ర నాయకత్వానికి న్యాయ సలహాలు ఇస్తారని కాబట్టి ఆయనే కోర్టు ధిక్కరణ అంటున్నారు అంటే కేంద్రం జగన్ మీద చర్యలు తీసుకుంటుందని. అంటే కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా జగన్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు బయలుదేరాయి.
అయితే న్యాయనిపుణులు మాత్రం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి కాదని న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. అటార్నీ జనరల్ జగన్ చేసింది తప్పు అంటే దాన్ని కేంద్రం చెబుతున్న మాటగా పరిగణించాల్సిన పనిలేదని అసలు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యలను పట్టుకుని జగన్‌ను ఇరికించే ఉద్దేశ్యం కేంద్రానికి ఉందని అనుకోవడం కరెక్ట్ కాదు. అటార్నీ జనరల్ జగన్ మాటలను తప్పుబట్టినప్పటి నుండి కేంద్రమే స్కెచ్ వేసి జగన్‌ను ఇరికింస్తుందని వాదిస్తూ చంకలు గుద్దుకుంటున్న కొంతమందికి ఇది కనువిప్పు కలిగించే సమాచారమే.