ఏపీలో మరో హిందూ ఆలయంపై దాడి .. ఈసారి ఎక్కడంటే !

ఏపీ లో మరో హిందూ ఆలయంపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆలయాలపై దాడులు చేసిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రామతీర్థం ఘటన మరువక ముందే మరో ఆలయంపై దాడి జరిగందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.

Hindu Temples: ఏపీలో కలకలం.., మరో హిందూ ఆలయంపై దాడి..! క్లారిటీ ఇచ్చిన పోలీసులు..!

తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగాపేరుగాంచిన వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని ముఖద్వారంపై విగ్రహాలు ధ్వంసమయ్యయి. ముఖద్వారం పైభాగంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మతుడు చేతులు విరిగిపోయి ఉన్నాయి. ఉదయం విగ్రహాలు ధ్వంసంమడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఉదయం విగ్రహాల ధ్వంసం ఘటన వెలుగులోకి రాగానే భక్తులు భారీగా అక్కడకు తరలివచ్చారు. ధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఐతే పోలీసులు ముఖద్వారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి దాడి జరగలేదని నిర్ధారించారు. ముఖద్వారాన్ని నిర్మించి చాలా కాలం కావడంతో సిమెంట్ పెచ్చులు విరిగిపడ్డట్లు తేల్చారు. విగ్రహాలు ధ్వంసం చేశారంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు రామతీర్థం ఘటనలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక దేవాలయం పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోదండ రాముని విగ్రహ పునఃప్రతిష్ఠపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అర్చకుకులు, పండితులతో చర్చించారు. ఆలయాన్ని ఆధునీకరించడతో పాటు.. కేవలం నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.