సమకాలీన రాజకీయాలపై పరిజ్ఞానం లేకపోయినా.. కాస్త అవగాహన ఉన్నా కూడా… ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనేది ఇట్టే తెలిసిపోతుంది! అలా అని పరిస్థితి 2019 ఎన్నికల ఫలితాలొచ్చిన కొత్తలో అంత దారుణంగానూ లేదు.. అలా అని ఇప్పటికిప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనుకునేటంత కంఫర్ట్ గానూ లేదు. ఇది తమ్ముళ్లు సైతం మొదట్లో నొచ్చుకున్నా.. ఆఖరికి ఒప్పుకునే అంశం! కాకపోతే… తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కాస్త ఊపిచ్చినట్లు కనిపిస్తుంది. అయితే… ఈ విషయంపై అచ్చెన్నాయుడు అతిగా స్పందిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
విషయానికొస్తే… ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలిసి ఇద్దరూ, తెలియకుండా ఇద్దరూ వైసీపీకి షాకిచ్చారు. టీడీపీ ఓటు వేశారు!! ఈ విషయాన్ని అధికారపార్టీ కూడా కన్ ఫాం చేసి, వారిని ససెపెండ్ చేసింది కూడా. అయితే… వారంతా ముందుగానే తమకు టచ్ లో ఉన్నారన్ని చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. నిజమే కాబోలు.. ఎందుకంటే.. టీడీపీకి అనుకూలంగా ఓటుకూడా వేశారు కాబట్టి! ఆ ఉత్సాహమో, లేక మైండ్ గేం లో భాగమో తెలియదు కానీ… ఈ నలుగురు కాదు… 16మంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు టీడీపీ నేతలు.
4*4 = 16… లెక్కల్లో అలా చెప్పారేమోలే అనుకుని సరిపెట్టుకునేలోపు… నాలుగురు కాదు – 16 మందీ కాదు – ఏకంగా 4*10 = 40 మంది వైకాపా నేతలు నాతో టచ్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే… అచ్చెన్నాయుడేమైనా “గే” నా మగాళ్లు మగాళ్లు టచ్ లో ఉండటానికంటూ.. పేర్ని నాని సెటైర్ వేసి.. ఆ 40మంది అనేది ఎంతగా లైట్ తీసుకునే విషయమో చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగని అచ్చెన్నాయుడు… మరోసారి టీడీపీతో టచ్ లో ఉన్న వైకాపా నాయకులపై కొత్త షాకింగ్ న్యూస్ చెప్పారు.
అవును… నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాను అబద్దాలు చెప్పడం లేదని మొదలుపెట్టిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉండడమే కాకుండా.. తమకే ఎదురు ఆపర్లు ఇస్తున్నారని తెలిపారు. అదేమిటయ్యా అంటే… ఒకరికి సీటిస్తామనే హామీ ఇస్తే.. ఏకంగా నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారట! వినడానికి ఏమాత్రం సౌకర్యంగా అనిపించని ఈ స్టేట్ మెంట్ అచ్చెన్న వదిలారు. ఒక్క ఎమ్మెల్యేకి టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు చెబితే… మిగిలిన ముగ్గురు కూడా సీటు ఇవ్వకపోయినా వైసీపీని వదిలి టీడీపీలో చేరిపోయి సేవ చేసుకుంటారంట!
ఈ రేంజ్ లో అచ్చెన్నాయుడు స్టేట్ మెంట్ ఇవ్వడంతో స్పందించిన వైకాపా నాయకులు… ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల తగిలిన వడదెబ్బ ఎఫెక్ట్ వల్ల అలా మాట్లాడుతున్నారే తప్ప… అందులో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పుకొస్తున్నారు. మరి అచ్చెన్న చెబుతున్నట్లు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు – వారికి సీట్లిస్తామని మాటైస్తే చాలు… పార్టీలోకి వచ్చేస్తామంటున్న 4*40 = 160 మంది వైకాపా ఎమ్మెలేలు / నేతలు… సైకిల్ ఎక్కెస్తే… ఇక ఫ్యాన్ పార్టీ ఖాళీ అయిపోయినట్లేగా! మరి ఇంతటి సువర్ణావకాశాన్ని చంద్రబాబు ఎంత తొందరగా అమలుచేస్తారనేది వేచి చూడాల్సిందే. దీంతో.. ఆ పనేదో తొందరగా కానివ్వండి సర్ అంటూ రిక్వస్టుల మీద రిక్వస్టులు చేస్తున్నారంట టీడీపీ కార్యకర్తలు.