Home Andhra Pradesh 'కొడాలి నానికి' నేనే కరక్ట్ అంటూ రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత

‘కొడాలి నానికి’ నేనే కరక్ట్ అంటూ రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత

ఆంధ్రప్రదేశ్: తాజాగా వైస్సార్సీపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. దేవినేని ఉమాని కొడతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే… తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. బూతుల మంత్రిని రాష్ట్రంపై ఊరి మీద ఆంబోతులా జగన్ రెడ్డి వదిలేశారు అని ఆయన ఆరోపణలు చేసారు. దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఆదీనంలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా? అని నిలదీశారు.

Atchannaidu Made Sensational Comments On Kodali Nani
atchannaidu made sensational comments on kodali nani

కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరింది అని అన్నారు. ఇష్టాను సారంగా ఎవరినిపడితే వాళ్లను మాట్లాడుతున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసారు. శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న దేవినేని ఉమని పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారు? అని నిలదీశారు. జనం ముందుకు నాని వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు అని అన్నారు. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు అని ఆరోపణలు చేసారు. ప్రభుత్వం మీద ప్రజలలో పెరుగుతున్న నిరసనని పక్కదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Posts

ఆ సినిమా చేయొద్దన్నా వినలేదు.. జేడీ చక్రవర్తి కామెంట్స్

జేడీ చక్రవర్తి సినిమాలు, ఆయన ఎంచుకునే పాత్రలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి జేడీ చక్రవర్తి తాజాగా మీడియాతో ముచ్చటించాడు....

శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని వెనక ఉన్న హీరోయిన్ తనే ..!

శ్యామ్ సింగరాయ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం. రీసెంట్ గా నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర...

త‌ర్వాతి సినిమాలో రెట్రో లుక్‌తో క‌నిపించనున్న ఉస్తాద్ హీరో..!

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పంథా మార్చాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌ల‌తో అల‌రించిన రామ్ ఇప్పుడు మాస్ మ‌సాలా లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్...

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన…ఆ ఆరుగురు వీరే !

ఏపీ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా...

Latest News