ఆ విషయంలో జగన్ గట్స్ ఉన్న సీఎం. ఇచ్చిన మాటను..చేసిన వాగ్ధానాన్ని పాలకులు మరవ కూడదంటారు. సరిగ్గా జగన్ ఆ రెండు పదాలకు పర్యాయ పదంలా నిలిచారు. అయితే కరోనా లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ఆలస్యం కావడం తో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారి సరిగ్గా జీతాలే వేయలేకపోతున్నారు. ఇంకా మూడున్నరేళ్ల పాలన మిగిలింది. ఎలా పాలిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతుందే తప్ప..పూర్తిగా వేయడం మానేయలేదు. రాష్ర్టం ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణం సహా ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న యాగీ కారణంగా ఇలా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటైన ప్రభుత్వం కాదు..బడుగు బలహీన, రైతు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వం. ఈ మాట జగన్ మోహన్ రెడ్డి ముందే చెప్పారు. ఇప్పుడదే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఆలస్యమైనా ఉన్న సేవింగ్స్ తో బయట పడగలడు..కానీ పేద వాడి పరిస్థితి అది కాదు. పని లేని కరోనా లాంటి విపత్కర సమయంలోనూ సంక్షేమాల ను అందించడంతోనే ఐదేళ్లు నోట్లోకి వెళ్లాయంటున్నారు. ఆ ఫలాలు అందించకపోయి ఉంటే కుటుంబం మొత్తం పస్తు ఉండాల్సిందేనని హర్షం వ్యక్తమైంది. అయితే మద్య నిషేధం విషయంలో ప్రభుత్వం ఎంత వరకూ సక్సెస్ అవుతుందన్న దానిపై బలమైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. దశల వారీగా మద్య నిషేధం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? అయినా ఐదు రాష్ర్టాలతో సరిహద్దు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు ఇది సాధ్యమేనా? రాష్ర్ట ఆర్ధిక పరిస్థితులు నడుమ నిషేధం సాధ్యం కాకపోవచ్చినది నిపుణుల మాట. మరి జగన్ లిక్కర్ బ్యాన్ నుంచి ఎలా బయట పడుతారో. ఇటీవలే ఏపీ హైకోర్టు మూడు మద్యం బాటిళ్లు ఇతర రాష్ర్టాల నుంచి ఏపీకి తెచ్చుకోవచ్చని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.