భక్తితో ఇచ్చిన కానుకను తిరస్కరించారని ప్రభుత్వం మీద అశోక్ గజపతి రాజు ఫైర్

Ashok Gajapati Raju fires on government for rejecting donation given for rama temple

ఆంధ్రప్రదేశ్: విజయనగరం జిల్లాలో గజపతి రాజులు గురించి, చెప్పాల్సిన పని లేదు. ఆ కుటుంబం త్యాగాల ముందు, ఇందిరా గాంధీ లాంటి నేత కూడా గౌరవంగా తల వంచి నమస్కారం పెట్టారంటే, ఆ కుటుంబం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి గజపతి రాజుల కుటుంబంపై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, వాళ్ళను అవమాన పరుస్తూ, కించ పరుస్తూనే ఉన్నారు. ముందుగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు గారిని, రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా పీకేసి, ఎక్కడ నుంచో గజపతి వారసులు అంటూ, ఒక మహిళను తీసుకుని వచ్చారు.

 

Ashok Gajapati Raju fires on government for rejecting donation given for rama temple
Ashok Gajapati Raju fires on government for rejecting donation given for rama temple

ఇదంతా విజయసాయి రెడ్డి డైరెక్షన్ లో జరుగుతుందని, అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ మహిళను చైర్ పర్సన్ గా పెట్టి, అశోక్ గజపతి రాజుని సాధిస్తూనే ఉన్నారు. అయితే దీని వెనుక భోములు కొట్టేసి స్కెచ్ ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇది పక్కన పెడితే, మొన్న రామతీర్ధం ఘటన ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఏకంగా రాములోరి తలకే రక్షణ కరువైంది. అయితే చంద్రబాబు రామతీర్ధం రావటంతో, ప్రభుత్వంలో వణుకు మొదలైంది.

చంద్రబాబు ఎక్కడ మైలేజి కొట్టేస్తారో అని, విజయసాయి రెడ్డి ఆ రోజు వచ్చిన చేసిన హడావిడి అందరూ చూసారు. అయితే చంద్రబాబుతో పాటు, అశోక్ గజపతి రాజు కూడా అక్కడకు వచ్చారు. అయితే రామతీర్ధం ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు ఉన్నారు కాబట్టి, ఈ ఘటనకు ఆయనే బాధ్యలు అంటూ, ప్రభుత్వం ఆయన్ను ధర్మకర్తగా తొలగించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన దేవాలయాల ఘటనల్లో ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే సమాధానం లేదు. అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారికి మరో అవమానం జరిగింది.

రామతీర్ధంలో కొత్త విగ్రహనికి, అశోక్ గజపతి రాజు, ఇచ్చిన విరాళాన్ని ప్రభుత్వం వెనక్కు తిప్పి పంపించింది. అయితే దీని పై అశోక్ గజపతి రాజు తీవ్ర ఆవేదనతో స్పందించారు. రాముడి కోసం భక్తితో ఇచ్చిన కానుకను తిరస్కరించారని, చూడబోతే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది అంటూ అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేసారు. భక్తితో ఇచ్చిన విరాళం, దేవాలయంలో ఏదో ఒక పనికి ఉపయోగించు కోవాలి కానీ, ఇలా తిరస్కరించి పంపటం ఏమి పద్ధతో ప్రభుత్వానికే తెలియాలి.