ఏపీలో ఓటుకు నోటు: బాబు వాంట్ ఓట్స్.. పవన్ వాంట్ నోట్స్…!

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పొత్తు రాజకీయాలపై కాస్త క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తనదైన పాలిటిక్స్ లో భాగంగా… ఇప్పటికీ బీజేపీతో పొత్తు విషయంపై మాత్రం అస్పష్టతను అలా స్పష్టంగానే ఉంచుతున్నారు. ఈ క్రమంలో పవన్ తాజాగా సీఎం పోస్ట్ పై మరోసారి తనదైన ప్రకటన చేశారు. దీంతో వైసీపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వస్తున్నాయి.

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్! ఇందులో భాగంగా… టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ కల్యాణ్‌ రాజకీయ పార్టీ పెట్టారే తప్ప ప్రజల కోసమో, జనసైనికుల కోసమో కాదని‌ అన్నారు. ఇదే సమయంలో… జనసేన పార్టీ పెట్టిన గత పదీ పదిహేను సంవత్సరాల నుంచి పవన్ కల్యాణ్ ముసుగేసుకుని రాజకీయాలు చేసున్నారని విమర్శించారు.

అదేవిధంగా… భారీ అవినీతి స్కాంలో అడ్డంగా బుక్కైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో పవన్ కల్యాణ్ ముసుగు తీశాడని అన్నారు. ఇలా ముసుగు తీసి పొత్తు పేరుతో రాజకీయ కుప్పిగంతులకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఫలితంగా చంద్రబాబుకు “రథసారథి” పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్హంగా… అసలు పవన్ కల్యాణ్‌ రాజకీయ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని స్పష్టం చేశారు!

ఇక చంద్రబాబుకు తన సొంత కొడుకు సమర్ధతపై నమ్మకం లేకనే సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారని విమర్శించిన మార్గాని భరత్… టీడీపీ, జనసేన దొందుకు దొందేననే విషయం ఎప్పటినుంచో చెబుతూ వచ్చామని అన్నారు. ఈ సందర్భంగా… చంద్రబాబుకు ఓట్లు కావాలి, పవన్ కల్యాణ్‌ కు నోట్ల కట్టలు కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్.

ఇక, చంద్రబాబు గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నప్పటికీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన కానీ, సానుభూతి కానీ రావడం లేదని భరాత్ విమర్శించారు. ఇదే సమయంలో… ఇటీవల కంబాల చెరువు పార్కు ప్రారంభోత్సవానికి వేలాదిగా జనం వచ్చారు.. దేవీ నవరాత్రులకు అత్యంత భక్తిశ్రద్ధలతో జనంతరలి వస్తున్నారు.. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్టు అయితే ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలని అన్నారు.

ఈ సందర్భంగా… చంద్రబాబు నక్క జిత్తుల రాజకీయాలను అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజల్లో స్పందన, సానుభూతి కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. అనంతరం… అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం మద్దతిస్తున్నారని తెలిపారు.