నిన్న అత్త .. నేడు మేనల్లుడు .. వీడియో వైరల్ !

ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకి సేవ చేసేవారు కానీ , అధికారం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఉపయోగించుకొని తమ మేలుకి వాడుకునే వారు కాదు. కానీ , ఈ మధ్య కాలంలో కొందరు ప్రజా ప్రతినిధులు వ్యవహార శైలి మరీ తీసికట్టుగా ఉంటుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద డబ్బులు కట్టే విషయంలో చాలామంది చాలాసార్లు రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి కాజా టోల్‌గేట్‌ వివాదం హాట్ టాపిక్ అయ్యింది.

image.png

టోల్ ప్లాజా సిబ్బందిపై ఆమె చేయి చేసుకున్నారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె పక్కకు లాగేశారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అడ్డంగా పెట్టిన బారికేడ్‌లను తీసుకొని విజయవాడ వెళ్లిపోయారు. ఈ సీన్ మొత్తాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఘటన బయటపడింది.

ఇదిలా ఉంటే ..  వైద్యం చేయించుకున్నాక బిల్లు కట్టమని నర్సింగ్ హోమ్ సిబ్బంది అడిగారు.. దీంతో రెచ్చిపోయిన అతడు బిల్లు విషయంలో గొడవకు దిగారు. తాను వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరింపులకు దిగారు. డాక్టర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక టోల్ ప్లాజా ఘటన పై రేవతి స్పందించారు. ఈ ఘటనలో టోల్ ప్లాజా సిబ్బంది ముందుగా దురుసుగా ప్రవర్తన కారణంగానే తాను కారు దిగాల్సి వచ్చింది అన్నారు. చట్టం ప్రకారం నడిచే వ్యక్తిని, సదరు టోల్ ప్లాజా సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు.