AP: గత ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో ఎంతో మంది కీలక నేతలు జనసేన , తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరుకు చెందిన వైకాపా నేత ఆళ్ల నాని వైసిపి ఓటమి పాలు కావడంతో తాను రాజకీయాలకు దూరమవుతున్నానని తెలిపారు. ఇలా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో తాను పాల్గొననని ఈయన తెలియజేశారు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈయన తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఏ క్షణమైనా చంద్రబాబు నాయుడు ఈయనని తన పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఆళ్ల నాని రాకపై చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాని చేరిక పైన మరోసారి ఆలోచన చేయాలని కోరారు. నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో టీడీపీ శ్రేణులను వేధించారని, పలువురుపై అక్రమంగా కేసులను నమోదు చేశారని తెలిపారు.
ఇలా కేసు నమోదు చేసిన వారందరూ కూడా ఇప్పటికీ కూడా కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు అందుకే ఒకసారి ఈయన ఎంట్రీ పై పునరాలోచన చేయాలి అంటూ ఎమ్మెల్యే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంపై చంద్రబాబు నాయుడు పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం.పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సహక రించాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆళ్ల నాని విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం ఏంటి అనేది సంచలనంగా మారింది.