నిమ్మగడ్డ ప్రభుత్వానికి అనుకలంగా వ్యవహరిస్తున్నారా .. అసలేంటి సంగతి ?

The High Court erred in the orders issued by Nimmagadda Ramesh Kumar

అందరూ ముందునుండి ఊహించినట్టే రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 12 కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి ఊహించిన విధంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వడంపై విపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి.నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు న్యాయస్థానాల్లో వరస దెబ్బలు తగులుతున్నాయి.

TDP won over 1100 seats in the first panchayat elections

మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఉత్తర్వులపై కూడా హైకోర్టు నుంచి అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. తాజాగా రేషన్ వాహనాల విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది.గత ఏడాది మార్చి నెలలో మున్సిపల్ ఎన్నికలను కరోనా కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అప్పడు నామినేషన్ల పర్వం పూర్తయింది. బెదిరింపులు చేసి నామినేషన్లు వేయనివ్వకుండా అధికార వైసీపీ అడ్డుకుంటుందని విపక్ష నేతలు ఆరోపించారు. కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

నామినేషన్లకు అవకాశమిస్తే ఈసారి తమ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశముంటుందని చెబుతున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో స్క్రూటిని నుంచి ఇప్పడు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎన్నికలకు సంసిద్దత వ్యక్తం చేయడంతో ఎన్నికల కమిషన్ పదిహేను రోజుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగిసేలా రీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. విపక్షాలు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్లయింది. పంచాయతీ ఎన్నికల్లో సందడిగా ఉన్న పల్లెలు, మున్సిపల్ ఎన్నికలతో పట్టణాలు కూడా సందడిగా మారనున్నాయి.