నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. వారికి నామినేషన్ వేసేందుకు మళ్లీ అవకాశం !

Nimmagadda sensational decision on ZPTC, MPTC elections!

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్ కాక రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ తీరుపై విమక్షలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎస్ఈసీకి ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆగినచోట నుంచే ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా లాభం లేకపోవడంతో.. బలవంతపు ఏకగ్రీవాలపై ఫిర్యాదల వెల్లువెత్తాయి.

what is the YSRCP next strategy

వీటిన్నటిపైనా విచారణ చేసి సరైన నిర్ణయం తీసుకుంటాను అన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తిరుపతి కార్పొరేషన్‌‌తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి అవకాశం కల్పించారు. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులకు రుజువులు ఉండడంతో..వాటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు చేసి ఎస్‌ఈసీ అనుమతించిన వారికే నామినేషన్లకు అవకాశం కల్పించారు.