AP Politics: మాకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి న్యాయం చేయాలి: వాలంటీర్లు

AP Politics: ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను చట్టబద్ధంగానే ఆయన అమలు చేశారు. ప్రతి ఏడాది బడ్జెట్లో వాలంటీర్ వేతనం కోసం బడ్జెట్ కూడా కేటాయించేవారు ఇలా వాలంటీర్ల సేవలను గౌరవించి వారికి ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం అందజేసేవారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపట్ల మొదట్లో విమర్శలు వచ్చిన ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా వాలంటీర్ వ్యవస్థ పై ప్రశంసలు కురిపించారు. ఇక చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ అది ఒక గోనెసంచుల మోసే ఉద్యోగం అని హేళనగా మాట్లాడారు. ఇకపోతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో హామీలను ప్రకటించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. అంతేకాకుండా వారికి గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఒకానొక సందర్భంలో వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు ఊహించని షాక్ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థలను రెన్యువల్ చేయలేదని తద్వారా వాలంటీర్ వ్యవస్థను ఈ ప్రభుత్వ హయాంలో కొనసాగించడం కష్టమే అనే విధంగా కూటమి నేతలు మంత్రులు వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు ఆందోళనకు దిగారు. దయచేసి మా వాలంటీర్ ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అంటూ ఎంతో మంది రోడ్లపైకి వచ్చారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వారికి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్లకు రాజకీయరంగు పూయకండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ ఆదేశాలు మేరకే మేము విధులు నిర్వహిస్తాము మా విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించండి అంటూ వాలంటీర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వేడుకున్నారు.